బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (10:36 IST)

హ్యాపీడేస్ లెక్చరర్‌ కమలిని ముఖర్జీకి పుట్టిన రోజు

Kamalini Mukarjee
శేఖర్ కమ్ముల "హ్యాపీడేస్" చిత్రంలో లెక్చరర్‌గా అభిమానుల మనస్సును కొల్లగొట్టిన కమలిని ముఖర్జీ, గమ్యం చిత్రంలో కథానాయికగా మాస్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.
 
పాఠశాల, కళాశాలల్లో పలు స్టేజ్ షోలు చేసిన కమలిని ముఖర్జీ 2004వ సంవత్సరంలో నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హోమ్లీ పాత్రలతో అభిమానులను ఆకర్షిస్తోన్న కమలిని ముఖర్జీకి నేడు పుట్టినరోజు (మార్చి 4). ఆనంద్ తర్వాత మీనాక్షి, స్టైల్, గోదావరి, క్లాస్‌మేట్స్, పెళ్లైంది కానీ.., హ్యాపీడేస్, గమ్యం, జల్సా, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, గోపి గోపిక గోదావరి వంటి చిత్రాల్లో కమలిని నటించింది.
 
ఇందులో 2008లో మెగా హిట్ అయిన గమ్యం సినిమాకు నంది అవార్డు లభించింది. అలాగే తమిళ అగ్రహీరో, పద్మభూషణ్ కమల్ హాసన్ సరసన "వేట్టైయాడు విలైయాడు" (తెలుగులో రాఘవ)లో నటించిన కమలిని ముఖర్జీ మరిన్ని చిత్రాల్లో నటించి, అవార్డులను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం..!.
 
అయితే ప్రస్తుతం కమలినీ ముఖర్జీ సినిమాలకు దూరంగా వున్నట్లు తెలుస్తోంది. ఆమెకు హీరోయిన్ అవకాశాలు వరించట్లేదు. దీంతో స్నేహ, మీనా వంటి హీరోయిన్లలా క్యారెక్టర్ ఆర్టిస్టులా, పవర్ ఫుల్ రోల్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 
 
కమలిని ముఖర్జీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె వ్యక్తిగత వివరాలు మీ కోసం..
పుట్టినరోజు: మార్చి 4, 1980.
జన్మస్థలం: కొల్‌కతా,
వయస్సు: 29,
తండ్రి: వ్యాపారవేత్త,
తల్లి: గార్మెంట్ డిజైనర్,
తెలుగులో తొలి చిత్రం: ఆనంద్,
చదువు: ఇంగ్లీష్ లిట్ (డిగ్రీ),
అవార్డులు: ఆరు నంది అవార్డులు.