గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (17:44 IST)

స‌స్సెన్స్ థ్రిల్ల‌ర్‌గా ఈ కథలో పాత్రలు కల్పితం

Ee kathalo patrlu kalpitam
నటీనటులు: పవన్‌ తేజ్‌, మేఘన, ప్రిద్వి, రఘుబాబు, నవీన్, అభయ్, సింగర్ నోయెల్ తదితరులు .
సాంకేతిక‌తః 
సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌.ఎన్‌, సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌. ఆర్‌- తిరు, డైలాగ్స్ అండ్ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: తాజుద్దీన్‌ సయ్యద్‌, నిర్మాత: రాజేష్‌ నాయుడు, క‌థ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: అభిరామ్ ఎమ్‌.
 
మెగాస్టార్ ఫ్యామిలీ కి చెందిన మరో హీరో పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ఈ కథలో పాత్రలు కల్పితం. ఇటీవ‌లే మెగాస్టార్ కూడా క‌ష్ట‌ప‌డితేకానీ విజ‌యం చేరుకోలేమ‌ని వెల్ల‌డించారు. అందుకే కొత్త క‌థ‌తో ముందుకు వ‌చ్చాన‌ని హీరో అంటున్నాడు. కొత్త దర్శకుడు అభిరామ్ తెరకెక్కించిన సినిమానే `ఈ కథలో పాత్రలు ఎలా కల్పితం`. ఈరోజే విడుద‌లైన ఈ సినిమాకు అలా టైటిల్ ఎందుకు పెట్టాడో తెలుసుకుందాం.
 
కథ :
హీరో కృష్ణ ( పవన్ తేజ్ కొణిదెల) సినిమాలంటే పిచ్చి. హీరో అయిపోవాల‌నుకుంటాడు. త‌న స్నేహితుడు నిర్మాత ర‌త్నం (ర‌ఘుబాబు) ద‌గ్గ‌ర మేనేజ‌ర్‌గా వుంటాడు. హీరోగా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న క్ర‌మంలో అప్ప‌టికే  ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి ( మేఘన కుమార్) ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. తరువాత అతని ప్రేమలో ఆమె కూడా పడిపోతుంది. ఇలా సాఫిగా సాగిపోతున్న క్రమంలో కృష్ణ కు హీరోగా ఛాన్స్ వస్తుంది. ఆ సినిమా కథ ఓ పాపులర్ మోడల్ రియల్ కథతో జరుగుతుంది. ఆ పాపులర్ మోడల్ జీవితం నేరమయం అవ్వడంతో ఏసిపి ( ప్రిద్వి ) అన్వేషణ మొదలు పెడతాడు. అసలు ఆ మోడల్ ఎవరు ? ఆమె వెనకున్న కథేమిది ? ఇంతకీ హీరో అవ్వాలనుకున్న కృష్ణ ఎందుకు ఆ మోడల్ విషయంలో రియాక్ట్ అవుతాడు లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
 
విశ్లేష‌ణః
ఈమ‌ధ్య స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ల‌కే కొత్త‌వారు ఆస‌క్తి చూపుతున్నారు. అదే సేఫ్‌జోన్‌గా భావించారు. అందుకే పోటీగా అర‌ణ్య‌, రంగ్‌దే సినిమాలు వున్నా ధైర్యంగా విడుద‌ల చేశారు. సినిమా క‌థ‌కాబ‌ట్టి ద‌ర్శ‌కుడు అనుకున్న‌విధంగా రాసుకుని మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. ఒక‌వైపు స‌స్పెన్స్ మ‌రోవైపు ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేల‌న్స్ చేశాడు ద‌ర్శ‌కుడు. నేడు సమాజంలో జరుగుతున్నా విమెన్ ట్రాఫికింగ్ ను ఎంచుకుని దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించిన విధానం బాగుంది. ఈ విషయంలో దర్శకుడు అభిరాం సక్సెస్ అయ్యాడు.  
 
హీరోగా  కొణిదెల ఫ్యామిలీ హీరోగా మెగాస్టార్ చిరంజీవి దగ్గర బంధువు అయిన పవన్ తేజ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. అతని బాడీ లాంగ్వేజ్, స్టైల్, డైలాగ్స్ అన్ని బాగున్నాయి. అయితే కొన్ని కొన్ని సీన్స్ లో అతని పేస్ మరి పేల‌వంగా కనిపించడం కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. డాన్స్, ఫైట్ అన్నింటిలో తనదైనా స్టైల్ చూపించాడు. ఇక హీరోయిన్ మేఘన గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అందం, అభినయం తో మేఘన కుర్రకారును తన ప్రేమలో పడేసింది. ఇక ఏ సిపిగాపృథ్వి మెప్పించాడు. అలాగే రియల్ రత్నం పాత్రలో రఘుబాబు తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రల్లో నవీన్, అభయ్ చక్కగా చేసారు.. ముక్యంగా నెగిటివ్ పాత్రలో సింగర్ నోయల్ నటన బాగుంది.
 
సాంకేతికంగా చూస్తే,  సినిమాటోగ్రఫీ బాగుంది సునీల్‌ కుమార్ అందించిన కెమెరా ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి, చాలా సీన్స్ చాలా అందంగా చూపించారు. సంగీతం అందించిన కార్తీక్‌ కొడకండ్ల సాంగ్స్ తో పాటు ఆర్ ఆర్ తో అదరగొట్టాడు. కార్తీక్ అందించిన ఆర్ ఆర్ ప్రధాన హైలెట్ గా నిల్చింది. సినిమాలో సీన్స్ ఎలివేట్ చేయడంలో ఆర్ ఆర్ సూపర్ అని చెప్పాలి. ఇక ఎడిటింగ్ అందించిన శ్రీకాంత్‌ పట్నాయక్, ఆర్ తీరు ల పనితీరు బాగుంది. ఎక్కడ బోర్ కొట్టే సీన్స్ లేకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే సినిమాలో డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. స్క్రీన్‌ప్లే డైలాగ్స్ ఇచ్చిన తాజుద్దీన్‌ సయ్యద్ మంచి ప్రయత్నం చేసాడు.  ముగింపువ‌ర‌కు ఏదో వుంద‌నే ఆస‌క్తిని ద‌ర్శ‌కుడు క‌లిగించాడు. ఇక నిర్మాత రాజేష్‌ నాయుడు నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్ః3/5