భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి
భారతదేశం త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. పాకిస్తాన్ ఆశ్రయమిస్తున్న ఉగ్రవాద శిబిరాలను తుక్కుతుక్కు చేసాయి. ఇంకోపక్క కరాచీ నౌకాశ్రయాన్ని భారతదేశ ఐఎన్ఎస్ విక్రాంత్ నేలమట్టం చేసింది. ఎటు చూసినా బాంబుల మోతతో పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది. మరోవైపు క్వెట్టా నగరంలో పాకిస్తాన్ సైనికులపై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడుతోంది. అదనుచూసి పాక్ సైనికులను బెలూచ్ ఆర్మీ అంతుచూస్తోంది.
భారత్ సైనిక దాడుల దెబ్బకు పాకిస్తాన్ ప్రధానమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో బాంబులు పడటంతో పాక్ ప్రధాని బిక్కచచ్చిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1971 తర్వాత ఇంత భారీ స్థాయిలో దాయాది దేశం పాకిస్తాన్ పైన యుద్ధం చేయడం ఇదే మొదటిసారి. అరాచకాలతో కాకుండా అభివృద్ధిలో పోటీపడదాము అని ఎంతోమంది చెప్తున్నప్పటికీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా వుండటాన్నే నమ్ముకున్నది. దానికి ప్రస్తుతం మూల్యం చెల్లించుకుంటోంది.