గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జూన్ 2020 (22:06 IST)

చిరంజీవి సర్జా భార్య మేఘనా 4నెలల గర్భవతి.. బిడ్డను చూడకుండానే..? (video)

Chiranjeevi sarja,
కన్నడ నటుడు చిరంజీవి సర్జా 39 సంవత్సరాల వయస్సులో గుండెపోటు కారణంగా కన్నుమూసిన విషాద వార్త సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వార్త సినీ పరిశ్రమను లెక్కలేనన్ని మంది అభిమానులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో చిరంజీవి సర్జా తన బిడ్డను చూడటానికి ముందే కన్నుమూశాడు.

అతని భార్య మేఘనా రాజ్ నాలుగు నెలల గర్భవతి కావడంతో ఆయన కుటుంబంలో మరింత బాధ ఎక్కువైంది. ఇకపోతే.. చిరంజీవి సర్జా అంత్యక్రియలు సోమవారం ఆయన ఫామ్ హౌస్‌లో జరుగనున్నాయి. 
Chiranjeevi Sarja
 
చిరంజీవి సర్జా సక్సెస్‌ఫుల్ యాక్టర్. ప్రధానంగా రీమేక్‌ సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం అతని నాలుగు చిత్రాలు నిర్మాణ దశలో వున్నప్పుడే ఈ విషాదం జరిగిపోయింది. గుండెపోటు కారణంగా బెంగళూరులోని సాగర్ అపోలో ఆసుపత్రికి సర్జాను తరలించారు.

కానీ చికిత్సకు స్పందించకపోవడంతో ఆయన కన్నుమూశారు. కరోనా వైరస్ పరీక్ష కోసం ఆయన స్వాబ్‌ను ల్యాబ్‌కు పంపినట్లు తెలిసింది. కాగా ఇటీవలే చిరంజీవి సర్జా తన రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.