గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 5 ఏప్రియల్ 2021 (17:34 IST)

విజయ్‌ దేవరకొండ- అనన్య పాండేతో ‘స్వైప్స్‌ అప్‌’ బ్రాండ్‌ నూతన ప్రచారం ప్రారంభించిన మోజ్‌

భారతదేశపు సుప్రసిద్ధ లఘు వీడియో యాప్‌ మోజ్‌, తమ సరికొత్త బ్రాండ్‌ ప్రచారం ‘స్వైప్‌ అప్‌ విత్‌ మోజ్‌’ను ఆరంభించింది. అత్యుత్తమ వినోద కేంద్రంగా తమ స్థానాన్ని బ్రాండ్‌ దీని ద్వారా బలోపేతం చేసుకోనుంది. ఈ ప్రచారంలో భాగంగా, మోజ్‌ ఇప్పుడు టాలీవుడ్‌ హృదయస్పందన విజయ్‌ దేవరకొండతో పాటుగా బాలీవుడ్‌ దివా అనన్య పాండేలతో భాగస్వామ్యం చేసుకుంది. వీరు యాప్‌ యొక్క బ్రాండ్‌ వీడియోలపై కనిపించడంతో పాటుగా మోజ్‌పై క్రియేటర్లుగా కూడా కనిపించనున్నారు.
 
ఈ వాణిజ్య ప్రకటనలను ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా మోజ్‌ యొక్క విభిన్నమైన ప్రేక్షకులను చేరుకునేందుకు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం మరియు హిందీ భాషలలో ప్రసారం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో బ్రాండ్‌ యొక్క ఉనికిని మరింతగా పెంపొందించేందుకు విజయ్‌ దేవరకొండ సహాయపడితే, హిందీ మాట్లాడే ప్రాంతాలలో బ్రాండ్‌ యొక్క చేరికను మరింతగా అనన్య పాండే విస్తరించనున్నారు.
 
ఈ వాణిజ్య ప్రకటనలలో విజయ్‌ మరియు అనన్యలు తమ ఇంటి వద్ద తమ తల్లిదండ్రులు మరియు పెద్దలు గొడవ పడుతున్నప్పటికీ ఫోన్లను స్వైప్‌ చేస్తుంటారు. నిత్యం వారి గొడవలతో చికాకు పొందిన వారు, మోజ్‌పై స్వైప్‌ చేయడంతో పాటుగా తమ తల్లిదండ్రులు మరియు బంధువులు ఆహ్లాదకరమైన సంగీతానికి నృత్యం చేస్తున్నట్లుగా ఊహించుకుంటారు. తద్వారా తమ అమ్మలతో కూర్చోవడంతో పాటుగా తమ మోజ్‌ వీడియోలను కలిసి చూడటం వీలవుతుంది. తద్వారా బ్రాండ్‌ ట్యాగ్‌ లైన్‌, కేవలం మోజ్‌పై మాత్రమే వినోదం సాధ్యం అని వెల్లడిస్తుంది.
 
‘స్వైప్‌ అప్‌ విత్‌ మోజ్‌’ ప్రచారంతో ప్రధానంగా వినోదం కోసం వెదుకుతున్న వినియోగదారులను లోతుగా అర్ధం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఉత్సాహపూరితమైన కంటెంట్‌తో వారి దృష్టిని ఆకర్షించడంతో పాటుగా వారి ప్రతి రోజూ జీవితాలకు వినోదాన్నీ జోడిస్తుంది. అదే సమయంలో మార్పుల్లేని జీవితంలో నూతనోత్సాహమూ తీసుకువస్తుంది.
 
ఈ లఘు వీడియో ఫార్మాట్‌ ప్రయాణ సమయాల్లోనూ కంటెంట్‌ వినియోగ మార్గంగా నిలిచింది. ఇది కేవలం ఓ స్వైప్‌ చేయడం ద్వారా డిజిటల్‌ ప్రజలకు వారి స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులో ఉంటుంది. మోజ్‌ దీనిని అద్భుతంగా ఒడిసిపట్టడంతో పాటుగా వినియోగదారులు అన్వేషించేలా మరియు నూతన, తాజా కంటెంట్‌ను ఒడిసిపట్టేలా ప్రోత్సహిస్తుంది. కేవలం ఓ స్వైప్‌ అప్‌తో అపరిమిత వినోద ప్రపంచంలోకి ప్రవేశించండి.
 
ఈ ప్రచారం గురించి అజిత్‌ వర్గీస్‌, చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌, మోజ్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో లఘు వీడియోలు అసాధారణ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. అతిపెద్ద షార్ట్‌ వీడియో కంటెంట్‌ లైబ్రరీతో మోజ్‌ దీనిలో అగ్రగామిగా ఉంది. స్వైప్‌ అప్‌ విత్‌ మోజ్‌ ప్రచారాన్ని ‘హ్యాంగ్‌వుట్‌ కోసం అత్యుత్తమ ప్రదేశంగా మోజ్‌’ను నిలిపే ప్రయత్నంతో రూపొందించడం జరిగింది. లఘు వీడియోలకు ప్రతి రూపమైన మోజ్‌, వినోదాత్మక ప్రపంచాన్నిమన మునివేళ్లపై అందిస్తుంది. ఈ చమత్కారయుతమైన నూతన ప్రచారం, మా ప్రేక్షకులతో మరింత లోతైన, నూతన కనెక్షన్స్‌ను నిర్మించడంలో సహాయపడుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఇంటర్నెట్‌  ప్రజల నడుమ అధిక వాటాను పొందడాన్ని మేము లక్ష్యంగా చేసుకున్నాం’’ అని అన్నారు.
 
మోజ్‌ ప్రచారకర్తగా నిలువడంపై విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ, ‘‘ భారతీయులు వినోదాన్ని ప్రేమిస్తారు. అది సంగీతం, నృత్యం, హాస్యం లేదంటే డ్రామా, ఏదైనా కావొచ్చు. మోజ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. భారతదేశంలో అగ్రశ్రేణి లఘు వీడియో వేదిక ఇది. యాప్‌ పైన ఉన్నటువంటి వినోదాత్మక, ట్రెండీ, తగిన రీతిలో ఉన్నటువంటి లైట్‌ కంటెంట్‌ను నేను అభిమానిస్తున్నాను. ఇది నా మూడ్‌ మార్చడంతో పాటుగా నాకు పూర్తి వినోదాన్నీ అందిస్తుంది. సంస్కృతిని సమూలంగా మార్చే షార్ట్‌ వీడియోలు మోజ్‌ కుటుంబంలో భాగమయ్యేందుకు నాకు స్ఫూర్తి కలిగించాయి. వినోదాత్మక, అనుసంధానిత కంటెంట్‌ను తీర్చిదిద్దడం ఆనందంగా కూడా ఉంది’’ అని అన్నారు.
మోజ్‌తోతన భాగస్వామ్యం గురించి అనన్య పాండే మాట్లాడుతూ, ‘‘ఓ వ్యక్తిగా, నేను వినోదాన్ని అమితంగా అభిమానిస్తుంటాను. వినోదాత్మక, ప్రయాణ సమయంలో కూడా అన్వేషించతగిన కంటెంట్‌ కోసం నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. నా ఫోన్‌పై ఉన్న క్విక్‌ స్వైప్‌అప్‌ అవకాశంతో, ఇప్పుడు నేను అపరిమిత వినోద అవకాశాలను ఎక్కడనుంచైనా పొందుతున్నాను. ఇందుకు మోజ్‌కు ధన్యవాదములు తెలుపుతున్నాను.
 
ఓ క్రియేటర్‌గా మోజ్‌పై భాగం కావడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పటికే దీనిపై ఉన్న సూపర్‌ కూల్‌ ఫిల్టర్స్‌తో నేను ప్రేమలో పడిపోయాను. కూల్‌ కంటెంట్‌ తీర్చిదిద్దుతుండటం పట్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను’’ అని అన్నారు. ఈ ప్రచార సృజనాత్మక రూపకల్పనను ఆల్‌ థింగ్స్‌ స్మాల్‌ చేసింది. ఈ వీడియోలను బ్యాంగ్‌ బ్యాంగ్‌ రూపొందించగా, ఈ రెండు వెర్షన్‌లకూ ర్యాన్‌ మెండొన్కా దర్శకత్వం వహించారు.