టిక్ టాక్ బ్యాన్: షేర్ చాట్‌ను కొనుగోలు చేయనున్న ట్విట్టర్?
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్‌కు భారత మార్కెట్లో మాంచి క్రేజ్ వుంది. ఈ క్రేజ్‌ను ఉపయోగించుకుని ట్విట్టర్ తన వ్యాపారాన్ని విస్తరించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో బాగా పాపులరైన షేర్ చాట్‌ను కొనుగోలు చేసేందుకు ట్విట్టర్ సిద్ధంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి. షేర్ చాట్‌ను కైవసం చేసుకోవడం ద్వారా.. దానికి సొంత ఇమేజ్‌ను ట్విట్టర్ ఖాతాలో పడుతుంది.
టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత దానికి సమానంగా ప్రపంచ వ్యాప్తంగా షేర్ చాట్ పాపులర్ అనే సంగతి తెలిసిందే. అలాంటి షేర్ చాట్‌ను సొంతం చేసుకోవడం ద్వారా ట్విట్టర్ వ్యాపారం విస్తరించే ఛాన్సుందని టెక్ క్రంచ్ వెల్లడించింది. ఇందులో భాగంగా 1.1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టేందుకు ట్విట్టర్ సిద్ధమని తెలుస్తోంది. కానీ షేర్ చాట్ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
భారత్‌లో 160 మిలియన్ల యూజర్లను కలిగివుంది షేర్ చాట్. అన్నీ ప్రాంతీయ భాషల్లో వుండే ఈ షార్ట్ వీడియో యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో 80 మిలియన్ల డౌన్‌డోన్లను దాటి కొత్త మైలురాయిని చేరింది. కాగా టిక్ టాక్‌ను భారత్‌లో నిషేధించిన నేపథ్యంలో షేర్ చాట్‌ను వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతుంది.