గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఫిబ్రవరి 2021 (21:47 IST)

బ్రేకింగ్.. మానవుల్లో తొలి బర్డ్ ఫ్లూ కేసు.. ఉపద్రవం ముంచుకొస్తుందా?

బ్రేకింగ్ న్యూస్ ఇదే. పక్షుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడం తెలిసిందే. ఇటీవల భారత్‌లోనూ బర్డ్‌ఫ్లూ కల్లోలం రేపింది. దేశంలోని చాలా రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూ దెబ్బకు వణికిపోయాయి. అయితే, కట్టుదిట్టమైన చర్యల కారణంగా ఆ తర్వాత అది నెమ్మదించింది. 
 
తాజాగా మానవుల్లో తొలి బర్డ్ ఫ్లూ కేసును రష్యాలో గుర్తించారు. దీంతో కరోనా విలయం నుంచి ప్రపంచం తేరుకునే ముందే ఉపద్రవం ముంచుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఇన్‌ఫ్లూయెంజా-ఎ వైరస్‌లోని H5N8 స్ట్రెయిన్‌ను వెక్టార్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు మానవుల్లో గుర్తించారు. 
 
బర్డ్‌ఫ్లూకు కారణమయ్యేది ఇదేనని.. మానవుల్లో తొలి బర్డ్‌ఫ్లూ కేసును వీరు గుర్తించారు. ఎవియన్ ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్ స్ట్రెయిన్ H5N8 హ్యూమన్ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన తొలి కేసు ఇదని వినియోగదారుల హక్కుల రక్షణ వాచ్‌డాగ్ రెస్పోట్రెబ్నాడ్జర్ హెడ్ అన్నా పొపోవా తెలిపారు.
 
పక్షుల్లో చాలా ప్రమాదకరమైన వ్యాధి అయిన ఇది ఇప్పటి వరకు మానవుల్లో కనిపించిన దాఖలాల్లేవు. రష్యా దక్షిణ ప్రాంతంలో డిసెంబరులో బర్డ్ ఫ్లూ వెలుగు చూడగా, ఓ పౌల్ట్రీ ఫామ్‌లోని ఏడుగురు ఉద్యోగుల్లో ఈ ఫ్లూ జాతి జన్యు పదార్థాన్ని శాస్త్రవేత్తలు వేరు చేశారు. కొద్దిపాటి క్లినికల్ లక్షణాలు తప్ప ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని పొపోవా తెలిపారు.