గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: సోమవారం, 16 నవంబరు 2020 (15:37 IST)

రామోజీరావుకు భగంవతుడు ఆయురారోగ్యం ప్రసాదించాలి: చంద్రబాబు నాయుడు

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈనాడు పత్రిక గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి స్వయంకృషితో ఎన్నో సంస్థల అధిపతిగా ఎదిగి వేలాది మందికి ఉపాధి కల్పించిన శ్రీ రామోజీరావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
 
పత్రికా అధిపతిగా సామాజిక విలువలను పెంపొందింటడమే కాకుండా, సాహితీ వికాసానికి, తెలుగు భాషా అభ్యున్నతికి, రైతాంగానికి ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయమని నారా చంద్రబాబు కొనియాడారు. పత్రికా అధిపతిగా ఎంతో ప్రాముఖ్యం వహించడమే కాకుండా ఎన్నో సామాజిక సేవల్లో రామోజీరావుగారి చాటిన ప్రజా శ్రేయస్సు విస్తృతమైందని తెలిపారు.
 
అటువంటి విశాల హృదయం కలిగిన రామోజీరావుగారికి భగవంతుడు ఆయురారోగ్యం, ఆనందాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.