ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 10 నవంబరు 2020 (21:07 IST)

దర్శకుడు క్రిష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవర్ స్టార్

యువ దర్శకుడు క్రిష్ జన్మదినం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియచేశారు. మంగళవారం సాయంత్రం ‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్‌లో పవన్ కల్యాణ్, క్రిష్‌కు పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలిపారు.
 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి ఎ.ఎం.రత్నం నిర్మాత. మంగళవారం సాయంత్రం పవన్ కల్యాణ్‌ని కలిసినవారిలో నిర్మాత ఎ.ఎం.రత్నం, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, రచయితలు భూపతి రాజా, కన్నన్‌లు ఉన్నారు.