ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: సోమవారం, 9 నవంబరు 2020 (18:50 IST)

పవన్ కల్యాణ్‌ను కలిసిన ఒడిశా తెలుగు ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు

ఒడిశాలోని పర్లాఖిముడి ఎమ్మెల్యే గజపతి జిల్లా బీజేపీ చీఫ్ కోడూరు రాయణరావు ఇవాళ హైదరాబాదులో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒడిశాలోని తెలుగువారి సమస్యల గురించి ఇరువురి మధ్య చర్చ జరిగింది.
 
ఒడిశాలోని గజపతి జిల్లాలో తెలుగువాళ్లు ఎక్కువమంది ఉన్నారని, సరిహద్దు ప్రాంతాల్లో వారికి పలు సమస్యలు ఎదురవుతున్నాయని పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు తెలిపారు. సమస్యల పరిష్కారానికి జనసేన కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం అనంతరం నారాయణరావు మాట్లాడుతూ తనకు చిరంజీవి, పవన్ అంటే ఎంతో ఇష్టమని తెలిపారు.
 
తెలుగు వారి ప్రాబల్యం గరించి వపన్ కల్యాణ్ కు వివరించానని, తమ విజ్ఞప్తి పట్ల ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. సరిహద్దు రెండు వైపుల ఉన్న ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, అయితే పాలనాపరమైన నిబంధనల వల్ల సమస్యలు వస్తున్న తీరును పవన్‌కు వివరించానని తెలిపారు. కాగా ఈ భేటీ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు నారాయణరావు పూరీ జగన్నాథుడి చిత్ర పటాన్ని బహుకరించారు.