గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (17:42 IST)

రోడ్ల నిర్మాణం... ఒకే నెలలో భారత్ ఖాతాలో 3 ప్రపంచ రికార్డులు.. నితిన్ గడ్కరీ

రోడ్ల నిర్మాణంలో భారత్ ఖాతాలో కొత్త రికార్డులు నమోదైనట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అత్యంత వేగంగా రోడ్డు నిర్మించిన వరల్డ్ రికార్డు ఇండియా పేరిట నమోదైందని నితిన్ గడ్కరీ శుక్రవారం వెల్లడించారు. మార్చిలో ఇలా మూడు వరల్డ్ రికార్డులను నమోదు చేసినట్లు తెలిపారు. 
 
కేవలం 24 గంటల్లో 2.5 కిలోమీటర్ల 4 లేన్ల రోడ్డు నిర్మించినట్లు చెప్పారు. అంతేకాకుండా 24 గంటల్లోనే 25 కిలోమీటర్ల 1 లేన్ రహదారిని షోలాపూర్‌-బీజాపూర్ మధ్య నిర్మించినట్లు తెలిపారు.
 
ఫిబ్రవరి 1, 2021 ఉదయం 8 గంటలకు ప్రారంభించిన 2.5 కిలోమీటర్ల 4 లేన్ల రోడ్డును మరుసటి రోజు ఉదయం 8 గంటల కల్లా పూర్తి చేసి వరల్డ్ రికార్డు సృష్టించింది పటేల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కాంట్రాక్టర్‌. 
 
2020-21 సంవత్సరంలో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మొత్తం 13,394 కిలోమీటర్ల పొడువైన రహదారులను నిర్మించింది. నేషనల్ హైవేల నిర్మాణంలో ఇండియా గణనీయ పురోగతిని సాధించినట్లు ఈ సందర్భంగా గడ్కరీ చెప్పారు.