మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (06:17 IST)

హెచ్1బీ సహా విదేశీ వర్కర్స్ వీసాలపై ముగిసిన నిషేధం..

గత అమెరికా ప్రభుత్వం హెచ్1బీతో సహా విదేశీ వీసాలపై విధించిన నిషేధం మార్చి 31వ తేదీతో ముగిసింది. ఇది డాలర్‌ డ్రీమ్స్‌ కలలుకంటున్న భారతీయ టెక్కీలకు ఎంతో ఊరటనిచ్చే అంశం. 
 
హెచ్‌1బీ సహా విదేశీ వర్కర్స్‌ వీసాలపై నిషేధం విధిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వుల గడువు మార్చి 31తో ముగిసింది. అధ్యక్షుడు అధ్యక్షుడు బైడెన్‌ ఆ నిషేధాన్ని మళ్లీ పొడిగిస్తూ ఎలాంటి ఉత్వర్వులు జారీ చేయకపోవడంతో అమెరికాకు వెళ్లాలనుకునే వివిధ దేశాలకు చెందిన టెక్కీలు ఊపిరిపీల్చుకున్నారు. 
 
గత ఏడాది కరోనా సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకొని ప్రపంచ మార్కెట్లు మూతపడిన సమయంలో ట్రంప్‌ హెచ్‌-1బీ సహా వలసేతర వీసాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించారు. తొలుత డిసెంబర్‌ 31వరకు నిషేధం విధించారు. ఆ తర్వాత ఆ నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగించారు. 
 
అదేసమయంలో తాను అధికారంలోకి వస్తే వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తానని బైడెన్‌ హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగానే అధికారంలోకి వచ్చిన జో బైడెన్ ఈ విసాలపై నిషేధాన్ని కొనసాగించకుండా మిన్నకుండిపోయారు.