సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (23:04 IST)

భర్తకు బ్రేకప్ చెప్పనున్న బ్యూటీ కీర్తి

బాలీవుడ్ నటి కీర్తి కుల్హరి భర్తకు బ్రేకప్ చెప్పనుందనే వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇదే అంశంపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టగా అది వైరల్ అయింది. 
 
'బ్రేకప్‌ చెప్పుకోవడమూ అంత ఈజీ ఏమీ కాదు.. కానీ తప్పడం లేదు. దయచేసి దీని గురించి ఎవరూ కామెంట్‌ చేయొద్దు. ఇప్పటికీ, ఎప్పటికీ కూడా!' అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేసింది. 
 
అంతేకాకుండా.. 'నేను, నా భర్త సాహిల్‌ విడిపోవాలని నిశ్చయించుకున్నాం. జీవితంలో మాత్రం ఎవరి దారి వారు చూసుకోవాలని ఓ నిర్ణయానికొచ్చాం. కలిసి ఉండాలనుకోవడం కన్నా విడిపోవడం చాలా కష్టం. ఎందుకంటే కలిసి జీవించినప్పుడు అందరూ దాన్ని సాదరంగా ఆహ్వానిస్తారు. కానీ విడిపోవడాన్ని ఎవరూ అంగీకరించకపోగా చాలామందిని అది బాధిస్తుంది' అని చెప్పుకొచ్చింది. 
 
కాగా, ఈమె పిక్, ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!’ అనే వెబ్ సిరీస్‌తో పాటు పలు చిత్రాల్లో నటించింది. తన నటనతో అందరిలో మంచి గుర్తింపు సాధించింది. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ద గర్ల్‌ ఆన్‌ ద ట్రైన్‌లోనూ కీలక పాత్రలో కనిపించింది. అలగే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోన్న క్రిమినల్‌ జస్టిస్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ ముఖ్య పాత్ర పోషించింది. 
 
అయితే కొందరు అభిమానులు మాత్రం ఈ విషయాన్ని నమ్మడం లేదు.. ఈమె పోస్ట్‌ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఏప్రిల్‌ ఫూల్‌ చేయడం లేదు కదా? అని అడుగుతున్నారు. మరికొందరేమో ఏంటి? నీకు పెళ్లి కూడా అయిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొందరు సెలబ్రిటీలు మాత్రం ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటించడాన్ని ప్రశంసిస్తున్నారు.