శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (11:57 IST)

డ్రగ్స్ కేసులో ప్రభాస్ హీరోయిన్ పేరు...

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రభాస్ సాహో చిత్రంలో నటించిన శ్రద్ధాకపూర్ పేరు వుందంటూ ప్రముఖ మీడియా సంస్థ వార్త రాసింది. ఇదిలావుంటే ఈ కేసులో ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. కరణ్ జోహార్ వీడియోలో ఉన్నట్లు ఒక వీడియోను జతచేసి ఎన్సీబీకి ఫిర్యాదు అందినట్లు సమాచారం. ఇది కాస్త ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది. ఆ వీడియో 2019సంవత్సరం నాటి వీడియో.
 
అందులో ప్రముఖ హీరో కరణ్ జోహార్ ఉన్నాడు. ఆయనే కాకుండా దీపికా పదుకొనే, విక్కీ కౌశాల్, మరికొందరు బడా స్టార్టు అందులో ఉన్నారు. డ్రగ్స్ వాడుతున్నట్లు అందులో స్పష్టంగా వీడియో ఉండడం ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద కలకలమే రేపుతోంది.
 
ఇప్పటికే పలువురు నటీమణులు ఇందులో ఉన్నారు. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ కూడా డ్రగ్స్ తీసుకొనే జాబితాలో ఉన్నట్లు వార్తలు రావడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. తన పరువుకు భంగం కలిగించేలా కొంతమంది వార్తలు రాస్తున్నారని.. ఆ వార్తలు నిలిపివేయాలని రకుల్ కోర్టును కోరింది.
 
ఇది జరుగుతుండగా మరికొంతమంది బడా స్టార్ల పేర్లు బయటకు రావడంతో బాలీవుడ్ లోనే కాదు దక్షిణాధి రాష్ట్రాల సినీపరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. దీనిపై అస్సలు నోరు మెదపడం లేదు హీరోహీరోయిన్లు. కానీ ఎన్సీబీ మాత్రం వేగంగా విచారణ కొనసాగిస్తోంది. డ్రగ్స్ కేసులో ఎవరెవరు ఉన్నారన్న విషయాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.