గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2020 (20:44 IST)

రియాకు నాకు సంబంధం లేదు... కానీ బలహీన క్షణాల్లో తప్పు చేస్తారు.. తాప్సీ Video

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అరెస్టుపై మరో నటి తాప్సీ పన్ను స్పందించింది. రియాకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయితే, ఈ కేసులో అరెస్టు అయిన రియా చక్రవర్తిని టార్గెట్ చేయడం చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై తాప్సీ స్పందిస్తూ, రియా ఎవరో తనకు తెలియదన్నారు. రియాతో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పింది. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసులో రియాను టార్గెట్ చేయడం, ఆమె పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధగా ఉందని తెలిపింది. 
 
బాలీవుడ్ సెలెబ్రిటీల్లో చాలా మంది ఏదో ఒక సమయంలో తప్పు చేశారని... అయితే, వారెవరినీ రియాను చూసినంత దారుణంగా చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైన బలహీన క్షణాల్లో తప్పు చేయడం సహజమన్నారు. 
 
ఇకపోతే, కంగనా రనౌత్ అంశంపై తాప్సీ స్పందిస్తూ, ఒక వ్యక్తి తరచూ వివాదాస్పదంగా మాట్లాడితే కొన్ని రోజుల తర్వాత వారి వ్యాఖ్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని వ్యాఖ్యానించింది. ఇదే మాదిరి కంగనా రనౌత్ మాటలు కూడా తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేవని చెప్పింది.