గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

నా హత్యకు మాఫియా గ్యాంగ్ ప్లాన్.. మోడీ - షా సాయం చేయాలి : పాయల్

తన హత్యకు మాఫియా గ్యాంగ్ ప్లాన్ చేస్తోందని, అందువల్ల తనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సాయం చేయాలని బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ కోరింది. బాలీవుడ్‌ హీరో సుశాంత్ మరణంతో పాటు.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు.
 
ముఖ్యంగా, ఈ విషయంలో నటి రిచాచద్దా పేరును కూడా ఆమె లాగుతూ ఆమెపై కూడా పలు ఆరోపణలు చేసింది. అయితే, పాయల్‌ ఆరోపణలతో తన మర్యాదకి భంగం వాటిల్లిందని రిచాచద్దా బాంబే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.  
 
అనురాగ్ కశ్యప్ గురించి ఆరోపణలు చేసే సమయంలో తన పేరుని ఉద్దేశపూర్వకంగానే పాయల్‌ బయటపెట్టిందని ఆమె చెప్పింది. ఈ పరిణామాల ఈ నేపథ్యంలో పాయల్ ఘోష్ తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఓ ట్వీట్ చేసింది. మాఫియా గ్యాంగ్‌ తనని చంపేస్తారని, దయచేసి తనకి సాయం చేయాలని ఆమె ప్రధానిని కోరింది.
 
సుశాంత్‌లా తాను కూడా చనిపోవాలని వాళ్లు భావిస్తున్నారని, అందుకే ఇప్పటివరకూ తన ఫిర్యాదుకి సమాధానం ఇవ్వలేదని తెలిపింది. బాలీవుడ్‌లోని ఇతర సెలబ్రెటీల్లా తన మృతి కూడా ఓ మిస్టరీగా మారిపోయేలా ఉందని ఆమె చెప్పింది. వారి మాఫియా గ్యాంగ్‌ తనను చంపేస్తుందని, తన చావుని ఆత్మహత్యగా ఆ గ్యాంగ్‌ చిత్రీకరిస్తుందని ఆమె చెప్పింది. ప్రధానితో పాటు కేంద్రమంత్రి అమిత్ షా తనకు సాయం చేయాలని ఆమె కోరింది.