గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Modified: మంగళవారం, 6 అక్టోబరు 2020 (18:09 IST)

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌ల మధ్య RRR షూటింగ్ సంభాషణ ట్వీట్

తారక్, రాంచరణ్, రాజమౌళి కాంభినేషన్లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ చాలా కాలం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. రామరాజు ఫర్ బీమ్ వీడియోను ఈ నెల 22న విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు.
 
ఈ విషయాన్ని చరణ్ కూడా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని చరణ్ తెలిపాడు. అంతేకాదు ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ ఓ కామెంట్ పెట్టారు. మై డియర్ తారక్ బ్రదర్.. మనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నది ఇప్పుడు నిజమవుతోంది. నేను నీకు ప్రామిస్ చేసిన విధంగా అక్టోబరు 22న నీకు మంచి గిప్ట్ ఇస్తున్నా అని ట్వీట్ చేశారు.
 
మరోవైపు ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించాడు. మళ్లీ సెట్స్ మీదకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. బ్రదర్ చరణ్ అక్టోబర్ 22 వరకు నేను వెయిట్ చేయలేకపోతున్నా అని ట్వీట్ చేశారు.