శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (14:52 IST)

డ్యాన్సుతో కుక్కలకు చుక్కలు చూపించిన బుడ్డోడు

పెంపుడు జంతువులు చేసే తమాషాలు వినోదాన్ని పంచుతుంటాయి. ఇదిలావుంటే తాజాగా ఓ బుడ్డోడు రెండు కుక్కలకు తన డ్యాన్సుతో చుక్కలు చూపించాడు. ఈ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.

రెండు పెంపుడు కుక్కలు గేటు లోప‌ల ఉండి అరుస్తున్నాయి. వాటిని చూసిన ఓ బుడ్డోడు సైకిల్ ఆపేసి గేటు బ‌య‌ట వాటికి ఎదురుగా డ్యాన్స్ చేస్తూ వాటిని ఆటపట్టించాడు.
 
ఈ వీడియోను వీడియోను జర్నలిస్ట్ వినేష్ ఖాటారియాత‌న ట్విట్ట‌ర్ పేజీలో పోస్టు చేయగా దాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ చూసారు. ఆ కుక్కలను అల్లాడించిన ఆ బుడ్డోడి డ్యాన్సులో ఎంతో నైపుణ్యం వుందంటూ మెచ్చుకున్నారు.