శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (15:39 IST)

ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ.. కేటీఆర్ ట్వీట్

తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఏర్పడిందని కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తోంది. 
 
తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్రంలో 967 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు ఉండేవి. నాంపల్లి, చందూరు, మునుగోడు, మర్రిగూడ మండలాల్లో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారిగా 1937లో ప్రకాశం జిల్లా దర్శిలో ఫ్లోరైడ్ గుర్తింపు జరిగింది. 
 
తెలంగాణలో 1945లో ఉమ్మడి నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని బట్లపల్లిలో ఫ్లోరైడ్ గుర్తింపు జరిగింది. బట్లపల్లి భూగర్భజలాల్లో ఫ్లోరైడ్ ఉందని నిజాం ప్రభుత్వంలో శాస్త్రవేత్తగా పనిచేసిన డాక్టర్ ఎంకే దాహూర్ గుర్తించారు.
 
ఉపరితల నీటి వనరులతో తాగునీరు సరాఫరా చేయాలని నిజాం ప్రభుత్వానికి సిఫారసు చేశారు. డాక్టర్ దాహూర్ సిఫార్సుతో నిజాం నవాబు చర్లగూడ, ఇబ్రహీంపట్నం, పసునూరు, తంగడిపల్లి, మునుగోడులో చెరువులను తవ్వించారు. 1985లో బట్లపల్లిలో ప్రపంచలోనే అత్యధిక పరిమాణంలో (28 PPM) ఫ్లోరైడ్ ఉన్నట్టు గుర్తించారు.  
 
ఫ్లోరైడ్ బాధితులను చూసి చలించిన కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తరువాత ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతీ ఇంటికి నల్లాతో రక్షిత మంచినీరు సరాఫరా చేస్తానని వాగ్ధానం చేశారు. ఇందులో భాగంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారు. మిషన్ భగీరథ ఉద్దేశ్యాన్ని చాటుతూ చౌటుప్పలో పైలాన్‌ను నిర్మించారు. తద్వారా తెలంగాణ ప్రస్తుతం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారింది.