జగన్ సక్సెస్, మేం కూడా వార్డు ఆఫీసర్ నియామకాలు త్వరలోనే చేపడతాం, మంత్రి కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ ప్రరభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన విధంగా త్వరలోనే తెలంగాణలో వార్డు ఆఫీసర్లను నియమిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ అంశంపై తాజాగా నిర్ణయాలను వెలువరిచారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో మంత్రి సమాధానమిచ్చారు.
వీలైనంత త్వరలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడతామని ఆయన ప్రకటించారు. వార్డు ఆఫీసర్ కార్యాలయాలు కూడా నిర్మిస్తామని తెలిపారు. ఇదే కనుక జరిగితే అనేకమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దొరకడంతో పాటు ప్రజా సేవలు సైతం మెరుగ్గా ప్రజలకు చేరుతాయని ఆయన వెల్లడించారు.
ఉద్యోగ నియామకాలు జరిగిన అనంతరం అభ్యర్థులకు మొదటి మూడేళ్లు ప్రొబేషనరీ కాల పరిమితి ఉంటుందని చెప్పారు. కార్పోరేట్ వార్డు ఆఫీసర్ కలిసి పనిచేస్తారని వెల్లడించారు. ఈ విధానాన్ని అమలులోనికి తీసుకొని వచ్చిన ఏపీ ప్రభుత్వం అనుకున్నట్టుగానే బాగానే విజయం సాధించిందన్నారు.