గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 9 ఆగస్టు 2020 (15:57 IST)

#AskKtr అయోధ్యలో మీ భాగస్వామ్యం ఏమిటి? కేటీఆర్‌కు ప్రశ్న

తెలంగాణ మంత్రి కే. తారకరామారావు ట్విట్టర్‌లో ఆస్క్ కెటియార్ (#AskKtr) పేరిట ప్రజలతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన సమాధానాలు.. కృష్ణా జలాల పైన తమ చట్టబద్ధ హక్కులను పైన పోరాటం కొనసాగుతుందని, ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పేషల్ లీవ్ పిటిషన్ వేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తమకు సత్సంభాధాలున్నాయని కానీ రాష్ట్ర హక్కుల పైన ఏలాంటి రాజీ ఉండబోదని తెలిపారు.
 
పెద్ద ఎత్తున కరోనా చికిత్సకు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలియ చేశారు అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి సేవలు అందిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని సందర్భంగా కోరారు.
 
ప్రయివేట్ ఆసుపత్రులు నిరాకరించిన వారికీ సైతం ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారని, ప్రభుత్వ వైద్యసిబ్బంది సేవలకు ప్రజలు మరింత గుర్తింపు, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే సుమారు 1200 పైగా సెంటర్లలో కరోనా టెస్టింగ్ జరుగుతుందని, ప్రస్తుతం రోజుకు 23 వేలకు పైగా కొనసాగుతున్న టెస్టుల సంఖ్య రానున్న రోజుల్లో 40 వేలకు పైగా పెరిగే అవకాశం ఉందని తెలియజెప్పారు.
 
కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కంటే తక్కువగా ఉన్నదని, రికవరీ రేటు దేశంలోని అత్యుత్తమంగా 72 శాతంగా నమోదవుతుందని తెలిపారు. కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలో పైన వస్తున్న వ్యతిరేక ప్రచారమే కాకుండా ఆ సంస్థలు చేస్తున్న సేవలు కూడా గుర్తించాలని, ఇప్పటికే వేలాది మందికి చికిత్స అందించి ఇంటికి సురక్షితంగా పంపించారన్నారు. 
 
ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం సందర్భంగా వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇది కేవలం తెలంగాణకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంశంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చినాక అనేక రకాల కార్యక్రమాలు చేపట్టామని శిశు, మాత మరణాలు తగ్గించగలిగామని, ఐదు నూతన మెడికల్ కాలేజ్ లను ప్రారంభించడంతో పాటు పలు ఏరియా ఆసుపత్రిలో ఐ సియూ యూనిట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. 
 
40కిపైగా డయాలిసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు 200కు పైగా హైదరాబాద్లో పని చేస్తున్నాయని తెలిపారు. కొవిడ్ పైన జరుగుతున్న యుద్ధంలో ప్రజలంతా కూడా ప్రభుత్వంతో కలిసి రావాలని కేవలం ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోతుదని, ముఖ్యంగా ప్రజలు భయాన్ని, దుష్ప్రచారాన్ని వదిలిపెట్టి కోవిడ్ ను ఎదుర్కోవాలని, రోగుల పట్ల సానుభూతితో ఉండాలని సూచించారు.
 
కెసిఆర్ యువతకి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆదర్శమని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. చదువుకున్న విద్యావంతులు ప్రజాస్వామిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలని ముఖ్యంగా చదువుకున్న యువత సైలెన్స్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదని అన్నారు.
 
రాష్ట్రంలో సిటీ బస్సులు, ఎంఎంటిఎస్ లు మరియు మెట్రోరైల్ వంటి సేవల ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శ్రీ అత్యుత్తమమైన స్కీమ్ అని, నిజానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ నమూనా పైన ఆధారపడి ఉందని తెలిపారు. త్వరలోనే ఎలిమినేడు ఏరోస్పేస్ పార్క్ కి శంకుస్థాపన ఉంటుందన్నారు.
 
గ్రామీణ ప్రాంతాల డిజిటలైజేషన్ పైన కూడా స్పందించిన మంత్రి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మరో సంవత్సరంలో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని, దీంతోపాటు గ్రామ సీమల అభివృద్దికి పల్లె ప్రగతి లో భాగంగా పెద్ద ఎత్తున గ్రామాల్లో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
 
అయోధ్య రామమందిరం నిర్మాణానికి తెలంగాణ యొక్క భాగస్వామ్యం ఏమిటన్న ప్రశ్నకు మంత్రి స్పందించారు. భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా కుల, మత, తరగతులకు అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలు, గౌరవం వంటి  లభించే రామ రాజ్యం రావాలన్న నా కోరికను ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు మరిన్ని అదనపు రాయితీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కేవలం హైదరాబాద్ పైనే మంత్రిగా మీరు దృష్టి సారిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు నిరంతరం నిధులు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా లక్ష్యాలు పెట్టి వారితో పని చేయిస్తూ వాటిని సమీక్షిస్తున్నామని త్వరలోనే మంచి ఫలితాలు చూస్తారని మంత్రి అన్నారు.