సంబంధిత వార్తలు
- Royal Sikh: రాజసం ఉట్టిపడే తలపాగాతో కనిపించిన పవన్ కల్యాణ్
- మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట
- అమరావతి రాజధానిలో 90 మంది రైతులకు 135 ప్లాట్లు
- ఆంధ్రా అరుణాచల... కోటప్పకొండ గిరిప్రదక్షణ మార్గం నమూనా లేఅవుట్ పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్
- Purushah: ఆ కిటికీ వద్ద ఏం జరుగుతోంది అంటోన్న వెన్నెల కిషోర్
పిల్లలను వదిలేశాడు.. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు.. పవన్‌పై పూనమ్ ఫైర్
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నటి పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. తన అర్ధాంగి అన్నా లెజినోవాతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడి శ్రీ గురు తేగ్ బహదూర్ షాహిది సమాగమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో పూనమ్ కౌర్ స్పందించారు.
తమ వారసత్వాలను మార్చుకుని, దుర్గుణాలను వదిలించుకునే వ్యక్తులు - మన ప్రియమైన గురువు పట్ల ఎటువంటి గౌరవాన్ని చూపించరు. గురు తేగ్ బహదూర్ జీ ఈ దేశం కోసం, ధర్మం కోసం ప్రతిదీ త్యాగం చేశారు. ఈ దుస్తులు, నకిలీ చిరునవ్వులు అధర్మాన్ని కప్పిపుచ్చడం తప్ప మరొకటి కాదు'' అని పూనమ్ ట్వీట్ చేశారు.
Pawan Kalyan _Anna
ఈ క్రమంలో ఓ నెటిజన్ పవన్ ఫొటోను పోస్ట్ చేస్తూ, ప్రాంతాల వారీగా విభజించే వారికి ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ఈ పోస్టుకు పూనమ్ కౌర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ను "మతమార్పిడులకు బ్రాండ్ అంబాసిడర్" అని అభివర్ణించారు. "తన వారసత్వాన్ని కాథలిక్ క్రైస్తవంలోకి మార్చిన వ్యక్తి, గురు తేగ్ బహదూర్ జీని ప్రార్థించవలసిన చివరి వ్యక్తి" అని ఆమె ఘాటుగా ట్వీట్ చేశారు.
పూనమ్ వ్యాఖ్యలపై మరో నెటిజన్ స్పందిస్తూ, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనని, పవన్ ఎవరినీ మతమార్పిడి చేయించలేదని, ఆయన పిల్లల్లో ఇద్దరు హిందువులేనని కౌంటర్ ఇచ్చారు.
దీనికి పూనమ్ బదులిస్తూ మరింత తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేశారు. "అదే పిల్లలను మరొకరి కోసం ఎలాంటి కారణం లేకుండా వదిలేశాడు. ఆ పిల్లల తల్లిని అతని సోదరుడు వేధించాడు. సిగ్గుచేటు.." అంటూ ఆమె చేసిన పోస్ట్ కలకలం రేపింది.
