క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ .. ఇండస్ట్రీ అద్దం లాంటిది
క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మగ పిల్లలైనా, ఆడ పిల్లలైనా చిత్ర పరిశ్రమలోకి వస్తే ఎంకరేజ్ చేయాలని కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీ అద్దం లాంటిది.. మనం ఎలా ప్రవర్తిస్తే.. ఫలితం కూడా అలాగే వుంటుంది. ఎవరి వర్కింగ్ స్టైల్ వారిది.. బాగాలేదు.. ఇబ్బందికర పరిస్థితులు వున్నాయంటే అది వారి తప్పిదమేనని చిరంజీవి తెలిపారు. మన శంకర వర ప్రసాద్ హైదరాబాద్‌లో భారీ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఇక మన శంకర వరప్రసాద్ గారు సినిమా గురించి స్పందిస్తూ... అన్నం, అమ్మ, సినిమా సక్సెస్ ఎప్పుడూ బోర్ కొట్టవు. ఈ సినిమా సక్సెస్ తర్వాత కొందరు చెప్పిన మాటలు నన్ను ఎమోషనల్ చేశాయి. ఈ వయసులో ఎందుకు ఇంకా కష్టపడతారు అని అడిగారు. కానీ నాకు కష్టపడటంలోనే ఆనందం ఉంది. అభిమానుల ప్రశంసలు, శ్రేయోభిలాషుల ఉత్సాహమే దానికి కారణం.. అంటూ వెల్లడించారు.
ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు విజయవంతం కావడం సంతోషంగా ఉంద న్నారు.కొందరు ఔట్‌డోర్ యూనిట్ బిల్లులు ఎక్కువ వేస్తున్నారని, కానీ ఈ సినిమాను 85 రోజుల్లోనే అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయగలిగామని గర్వంగా చెప్పారు.
