చిత్తూరు: ప్రైవేట్ కాలేజీ మూడో అంతస్థు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య (video)
మొన్నటికి మొన్న రాజస్థాన్‌లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ నాలుగో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవకముందే.. చిత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య ఏపీలో కలకలం రేపింది.
కాలేజీలో మూడో అంతస్థు నుంచి దూకి ఓ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతనిని బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్రగా గుర్తించారు. కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడిన రుద్రను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు.
ఐదు రోజుల క్రితం ఇదే కాలేజీలో మూడవ అంతస్థు నుంచి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తాజాగా మరో విద్యార్థి రుద్ర ఆత్మహత్యతో ప్రాణాలు తీసుకోవడం స్టూడెంట్స్‌లో ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఆత్మహత్యకు కారణాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు.