శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (20:00 IST)

పవన్ కళ్యాణ్‌కు బంపర్ ఆఫర్, బిజెపి వ్యూహమేంటి? (video)

భారతీయ జనతాపార్టీ వ్యూహాలు అన్నీఇన్నీ కావు. ఎపిలో కూడా అదే పరిస్థితి. ముందు నుంచి జనసేనతో సఖ్యతగా ఉంటూ వచ్చిన బిజెపి ఆ పార్టీ అగ్రనేత పవన్ కళ్యాణ్‌ను మరింత దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
తెలంగాణా రాష్ట్ర కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపికి పవన్ కళ్యాణ్ అవకాశం ఇవ్వడంతో కమలదళానికి బాగా కలిసొచ్చింది. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లోను ఎంపి సీటును బిజెపికే త్యాగం చేశాడు జనసేనాని. దీంతో త్యాగశీలిగా మిగిలిపోయాడు పవన్ కళ్యాణ్.
 
పవన్ కళ్యాణ్ త్యాగం కాస్త బిజెపి అగ్రనేతల దృష్టికి వెళ్ళిందట. ఎపి నుంచి బిజెపి తరపున పోటీ చేసే వ్యక్తులెవరూ పార్లమెంటులో లేకపోవడాన్ని బిజెపి అగ్రనేతలు ఆలోచించి పవన్ కళ్యాణ్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారట.
 
రాజ్యసభ సీటు ఇస్తే ఎపి తరపున పవన్ కళ్యాణ్ ఉంటారని.. బిజెపి తరపున ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు ఒక వ్యక్తి ఉంటారన్నది బిజెపి అగ్రనేతల ఆలోచనట. దీంతో జనసేనానికి ఆ పదవిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
 
ప్రస్తుతం వ్యక్తిగత సిబ్బందికి కరోనా రావడంతో హోంఐసోలేషన్‌లో పవన్ కళ్యాణ్ ఉండడం.. ఆయన ఆరోగ్యవంతంగా బయటకు వచ్చిన తరువాత ఈ విషయాన్ని చెప్పేందుకు బిజెపి రాష్ట్రనాయకులు సిద్ధంగా ఉన్నారట. మరి చూడాలి సినిమాల్లో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ రాజ్యసభ సీటు ఇస్తానంటే తీసుకుంటారో లేదోనన్నది.