శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (15:48 IST)

క్యారీ బ్యాగులపై పైసలు వసూల్ చేయక్కర్లేదు..

carie bags
సూపర్ మార్కెట్లలో క్యారీ బ్యాగులపై పైసలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫోరమ్ న్యాయస్థానం సూపర్ మార్కెట్లకు దిమ్మదిరిగే షాకిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. 
 
హైదర్ గూడ డిమార్ట్ పై ఉన్న కేసును వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా కీలక తీర్పు ఇచ్చింది వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం.
 
వినియోగదారుల నుండి క్యారీ బ్యాగ్ కోసం 3 రూపాయల 50 పైసలు తిరిగి చెల్లించడంతో పాటు పరిహారంగా వెయ్యి రూపాయలు చెల్లించాలని.. అలాగే.. న్యాయ సేవాకేంద్రానికి మరో వెయ్యి రూపాయలు వినియోగదారునికి చెల్లించాలని హైదర్ గూడ డిమార్ట్‌ను ఆదేశించింది కోర్టు.
 
45 రోజుల్లో తీర్పు అమలు కాకపోతే చెల్లించాల్సిన మొత్తానికి 18 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని తెలిపింది వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం.