ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 18 డిశెంబరు 2021 (19:44 IST)

లైఫ్‌స్టైల్‌ సుప్రసిద్ధ ఫ్యాషన్‌ బ్రాండ్లపై 50% వరకూ రాయితీ

తాజా ధోరణులకు సంబంధించి భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్‌ కేంద్రంగా వెలుగొందుతున్న లైఫ్‌స్టైల్‌, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సేల్‌’ను తీసుకువచ్చింది. డిసెంబర్‌ 18 నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. లైఫ్‌స్టైల్‌ వద్ద కొనుగోళ్లు జరిపిన వినియోగదారులు 50% వరకూ రాయితీ పొందడంతో పాటుగా మరెన్నో ఉత్సాహపూరితమైన డీల్స్‌ను తాజా శైలిలో అత్యున్నత ఫ్యాషన్‌ బ్రాండ్ల వ్యాప్తంగా పొందవచ్చు.

 
ఫ్యాషన్‌ షాపర్లు తమ వార్డ్‌రోబ్‌లకు ఆకర్షణీయమైన మేకోవర్‌ను అందించవచ్చు. లైఫ్‌స్టైల్‌ ఇప్పుడు ఆకర్షణీయమైన రాయితీలను స్త్రీ, పురుషులు, చిన్నారుల విభాగాలలో అందిస్తుంది. వినియోగదారులు లైఫ్‌ స్టైల్‌ యొక్క శక్తివంతమైన బ్రాండ్లు అయినటువంటి ఫోర్కా, జింజర్‌, మెలాంజ్‌, కప్పా, కోడ్‌, బోస్సిని, ఫేమ్‌ ఫరెవర్‌, జూనియర్స్‌ వంటి వాటిపై పొందవచ్చు. వీటితో పాటుగా సుప్రసిద్ధ బ్రాండ్లు అయినటువంటి వెరోమొడా, లెవీస్‌, పూమా, లోరెల్‌, టైటాన్‌, బిబా, ఓన్లీ, లూయిస్‌ ఫిలిప్పి, టామీ హిల్‌ఫిగర్‌ వంటి వాటిపై కూడా రాయితీలను అందుకోవచ్చు.

 
అప్పెరల్‌, బ్యూటీ, వాచెస్‌, ఫ్రాగ్రాన్స్‌, ఫుట్‌వేర్‌, హ్యాండ్‌బ్యాగ్స్‌, యాక్ససరీలులో తాజా ధోరణుల నుంచి వదులుకోలేనట్టి ఆఫర్లు పొందవచ్చు. లైఫ్‌స్టైల్‌ సేల్‌ అన్ని లైఫ్‌ స్టైల్‌ స్టోర్లతో పాటుగా ఆన్‌లైన్‌లో యాప్‌ వద్ద లభ్యమవుతుంది.  హైదరాబాద్‌లో శరత్‌ సిటీ మాల్‌, బేగంపేట, ఇనార్బిట్‌ మాల్‌, ఎల్‌ అండ్‌ టీ ఇర్రమంజిల్‌, డీఎస్‌ఎల్‌ వర్ట్యుమాల్‌ మరియు మూసారామ్‌ భాగ్‌ మాల్‌ వద్ద లభ్యమవుతుంది.