బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (15:40 IST)

పవన్‌కు తప్పిన పెను ప్రమాదం.. ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో...

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో పవన్‌కు ముప్పు తప్పింది. 
 
ప్రస్తుతం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆయన కాన్వాయ్ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం సమీపంలోకి రాగానే... కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది.
 
మరోవైపు జనసేన, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సినీరంగ సమస్యలను ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పవన్ పై మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. 
 
దీనికి తోడు సినీ నటుడు పోసాని కూడా పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించడం, జగన్‌ను ఏమైనా అంటే ఊరుకోబోమని హెచ్చరించడం తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటన చేపట్టారు.