బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (08:22 IST)

పోసానిపై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు...?

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. తన స్నేహితుడైన త్రివిక్రమ్‌తో కలిసి ఆయన స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. 
 
మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో పోసాని కృష్ణ మురళి ప్రెస్‌మీట్ ఏర్పటు చేసి పవన్ కళ్యాణ్‌ఫై, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రెస్‌క్లబ్ దగ్గరికి చేరుకొని పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. 
 
ఒకానొక సమయంలో అక్కడి ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అభిమానులను అదుపులోకి తీసుకొని, పోసానిని తమ వాహనంలో ఎక్కించుకొని అక్కడి నుండి తీసుకెళ్లడం జరిగింది. పోసాని సైతం పవన్ కళ్యాణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. అతని ఫ్యాన్స్ వల్ల తనకు ప్రాణహాని ఉందని.. తనకి ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ కారణమని పోసాని అన్నారు.