గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (21:56 IST)

పోసాని గంట లైవ్ విమర్శలకు పవర్ స్టార్ ఒక్క వీడియోతో రివర్స్ ఎటాక్

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ఏపీ మంత్రులు వరుసగా విమర్శలు చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారితో పాటు నటుడు పోసాని కూడా పవర్ స్టార్‌ను ఓ రేంజిలో విమర్శించారు. సుమారు గంటపాటు తూర్పారపట్టారు.
 
దీనిపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా రివర్స్ ఎటాక్ చేసారు. తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసిపి గ్రామసింహాల గోంకారాలు సహజమే అంటూ రాస్తూ... హు లెట్ ది డాగ్స్ ఔట్ అనే వీడియో సాంగ్ ను షేర్ చేసారు. అది తనకు ఎంతో ఇష్టమైన పాట అని కూడా తెలిపారు.