గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (19:17 IST)

ఏపీలో సినీ రాజకీయం : నేను జగన్ వీరాభిమానిని.. పవన్ ఓ సైకో... పోసాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా ఆల్‌లైన్ టిక్కెట్ల వ్యవహారం ఇపుడు రచ్చరచ్చగా మారింది. అధికార వైకాపా వర్సెస్ జనసేనగా మారింది. 'రిపబ్లిక్' సినిమా ఫంక్షన్‌లో ఏపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. పవన్‌కు కౌంటర్‌గా వైసీపీ మంత్రులు ఘాటుగానే విమర్శలు చేశారు. 
 
ఇదిలావుంటే, సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మధ్యలో ఎంటరయ్యారు. పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం మరోమారు వీర లెవల్లో రెచ్చిపోయారు. పవన్‌ను నోటికొచ్చినట్టు పచ్చిబూతులు తిట్టారు. 
 
'ఫ్యాన్స్‌తో గ్రూపును పెట్టుకున్నాడు. ఫంక్షన్లకు తన ఫాన్స్‌ను పంపిస్తున్నాడు. నువ్వు సద్దాం హుస్సేన్‌లా నియంతవా. పవన్ కల్యాణ్ ఒక సైకో. నా భార్యపై ఆరోణలు చేసి నైతికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. విష్ణుబాబు నామినేషన్ వేయడానికి వస్తే అక్కడా పవన్ బ్యాచ్ ఉంది. 
 
పవన్ కల్యాణ్ నేను డీమోరలైజ్ కాను. పవన్ కల్యాణ్ రోజూ నన్ను తిట్టు.. నేనిలానే బతుకుతా.. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా టైమ్‌లో నాకు, పవన్ మధ్య విభేదాలు వచ్చాయి. షూటింగ్ సమయంలో పవన్ నన్ను ఇబ్బందులు పెట్టారు. షూటింగ్‌లో సమయ పాలనను పవన్ పాటించరు. పవన్‌ను కేసీఆర్ బహిరంగంగా హెచ్చరించారు. అప్పుడు పవన్ అభిమానులు ఎందుకు ఊరుకున్నారు. జగన్‌పై విమర్శలు చేయడంతోనే నేను రియాక్ట్ అయ్యాను' అయ్యాను అని పోసాని వివరించారు. 
 
పైగా, నేను ఏపీ సీఎం జగన్ వీరాభిమానిని. కనీసం ఐదారు కిలోమీటర్లు కూడా నడవలేని పవన్ కల్యాణ్, పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడిచిన జగన్‌తో పోల్చుకోవడం తనకు నచ్చలేదన్నారు. తాను జగన్ అభిమానినని, ఆయనను ఎవరేమన్నా భరించలేనని పోసాని స్పష్టం చేశారు.