గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (13:41 IST)

వైకాపా నేతల అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకం : జీవీఎల్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీకి చెందిన వైకాపా మంత్రులు మూకుమ్మడిగా దుర్భాషలాడుతూ విమర్శలు చేయడాన్ని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా ఖండించారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. 
 
"పవన్ కళ్యాణ్ గారిపై వైసీపీ నాయకుల దుర్భాషలను ఖండిస్తున్నాను. విమర్శ తట్టుకొనే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార పార్టీకి ఉండాలి. నువ్వు ఒకటంటే నేను వంద అంటాను అనే అహంకార తీరు రాజకీయ పతనానికి సూచకం. తిట్ల తుఫానుకు తెరదించి గులాబ్ తుఫానుపై వైసీపీ శ్రద్ధ పెట్టాలి" అంటూ పిలుపునిచ్చారు. 
 
మరోవైపు, ఏపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల చేసిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఏపీ మంత్రులు విరుచుకుప‌డుతోన్నారు. అయినప్పటికీ పవన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ ధీటుగా స‌మాధానం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎల్ న‌ర‌సింహారావు విమ‌ర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.