బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (13:39 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస నేరాలు - ఘోరాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వ పాలనలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ఇటీవలి కాలంలో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఓ వివాహిత, ఓ వ్యక్తి తనువులు చాలించారు. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త ఆత్మహత్య చేసుకోగా.. భర్త మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా మదనపల్లిలో గుంటూరు జిల్లాకి చెందిన ఉదయ బాస్కర్ అనే వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్‌ఆన్ చేసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. 
 
అలాగే, నెల్లూరులో భర్త కళ్ల ముందే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ నగరంలో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 
 
గత సంవత్సరం అక్టోబర్‌లో అంజన్ కృష్ణ, రేణుకకు వివాహం జరుగగా, అంజన్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది గుర్తించిన భార్య రేణుక.. భర్తను మందలించింది. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన రేణుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.