ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (11:48 IST)

పవన్ వర్సెస్ పేర్ని : మాటలు - ట్వీట్ల యుద్ధం

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పేర్ని నానిల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. ఓ సినిమా ఫంక్షన్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలపై మొన్న మంత్రి పేర్ని నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో పవన్‌పై విమర్శలు చేశారు.
 
నాని వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా స్పందించిన పవన్.. 'తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే' నంటూ గత రాత్రి ట్వీట్ చేశారు.
 
ఈ ట్వీట్‌పై తాజాగా స్పందించిన మంత్రి పేర్ని నాని అదే స్థాయిలో మళ్లీ విరుచుకుపడ్డారు. 'జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు' అని ట్వీట్ చేస్తూ పవన్‌పై ఓ ట్రోలింగ్ వీడియోను షేర్ చేశారు.