మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (09:17 IST)

ఒరేయ్‌ సన్నాసిన్నర సన్నాసి...పవన్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మంత్రి పేర్ని

మంత్రి పేర్ని నాని పవన్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. ఒరేయ్, పవన్‌గా అంటూ అసభ్యంగా దూషించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
 
పవన్‌కళ్యాణ్‌ మాట్లాడిన అవాకులు చెవాకులు కేవలం జగన్‌గారిపై విష ప్రచారమే అన్న వాస్తవాన్ని మీరు అంగీకరించాలి. సినీ పెద్దలు ఆ విషయం చెప్పాలి. అదే చేస్తే మీరు సినీ పరిశ్రమ మేలు కోరిన వారవుతారని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో సినీ పరిశ్రమను జగన్‌మోహన్‌రెడ్డిగారు ఏం ఇబ్బంది పెట్టారో చెప్పండి.
 
పవన్‌ నాయుడుగారు నన్ను సన్నాసి అన్నారు. ఆయన, మేము చుట్టాలం. కాపు వాళ్లం. నేను సన్నాసిని అయితే, ఆయనెవరు సన్నాసిన్నర కదా. మాదంతా ఒకే కులం. ఒకే తానులో ముక్కలం. కాబట్టి ఎన్నో అనుకుంటాం.
 
మీడియా పాపం ఏమిటి?
సాయిధరమ్‌తేజ యాక్సిడెంట్‌ గురించి కూడా మావాడు మాట్లాడాడు. మా వెధవన్నర మాట్లాడుతూ, మీడియాది తప్పు. మీకు బుద్ధి ఉందా. ధైర్యం ఉందా అన్నాడు. అసలు మీడియా తప్పు, పాపం ఏమిటి.

మా పవన్‌కళ్యాణ్‌ మాదిరిగా సాయిధరమ్‌తేజ్‌ తప్పులోడు కాదు. మంచి కుర్రోడు. బుద్ధిమంతుడు సినీ పరిశ్రమలో మంచి కుర్రోడు అన్న పేరుంది. ఆ కుర్రోణ్ని పట్టుకుని ఎందుకు అపవిత్రం చేస్తున్నావు. అసలు మీడియాకు గుండెకాయ లేదా. మా పీకే గాడికి లేదా.

అసలు యాక్సిడెంట్‌ రోజు తెలంగాణ పోలీసులు ఏం చెప్పారు. వారు ఎఫ్‌ఐఆర్‌లో ఏం రాశారో అదే మీడియాలో చెప్పారు. కాబట్టి ఇక్కడ తెలంగాణ పోలీసులను తప్పు పట్టాలి. కానీ నీవు ఆ పని చేయలేదు. 
 
ఆయనను తిట్టలేవు!:
ఎందుకు నీకు భయమా. జగన్‌గారు అంటేనే నీకు లోకువా. కేసీఆర్‌ను ఏమీ అనలేవా. పోటుగాడివి అని చెబుతావా. కేసీఆర్‌ను తిట్టు. ఏమైంది దమ్ము, ధైర్యం లోపలికి పోయావా. కేసీఆర్‌ను తిట్టాలంటే గజగజ కారిపోతుంది ప్యాంట్‌లో. ఇవి అందరికీ తెలుసు. 
 
ఇది రిపబ్లిక్‌ ఇండియా, అందుకే:
నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇది రిపబ్లిక్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కాదు. రిపబ్లిక్‌ ఇండియా. అందుకే మనం పిచ్చవాగుడు. ఏది వాగినా కూడా చలామణి అయిపోతుంది. హీరోగా మనకు మనం ఊహించుకుంటున్నాం. ఇది రిపబ్లిక్‌ ఇండియా కాబట్టే, పీకే నీవు వింటున్నావు అనుకుంటున్నాను. 
 
నువ్వు నా ఫ్యాన్‌:
నువ్వు నాకు పెద్ద ఫ్యాన్‌వు. నా ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌వు. నాకోసం బందరు వచ్చావు. నీ వకీల్‌సాబ్‌ షూటింగ్‌ ఆపుకుని. నీ కాల్‌షీట్‌ విలువెంతో నీకు తెలుసు. అయినా విజయవాడకు వచ్చి అక్కడ పడుకుని, అక్కడి నుంచి బందరు నన్ను తిట్టి వెనక్కి పోయావు. అంటే నీ మనసు నిండా నేనే ఉన్నాను. నా ఫ్యాన్‌వు నువ్వు. నీకు కంపరమో, చికాకో లేక గగ్గుర్పాటో ఎందుకో తెలియదు.

అక్కడికి వస్తావు. ఎవరయ్యా మీ ఎమ్మెల్యే అంటావు. అక్కడి దాకా ఎందుకు వచ్చావు. ఏ ఊరు వస్తున్నావు. అక్కడి ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియనటువంటి శుంఠన్నర శుంఠవా నువ్వు ఏరా పీకే. మనమంతా కాపులం కాబట్టి మాట్లాడుతున్నాను. అంతే తప్ప, సభ్యత వదిలేసి మాట్లాడడం లేదు. ఎందుకంటే మనమంతా చుట్టాలం కాబట్టి. నువ్వు నన్ను సన్నాసి అన్నా. నేను నిన్ను శుంఠ, శుంఠన్నర అన్నా. మనమంతా ఒకే ఫ్యామిలీ. ఒకే కులం.
 
నీకు దమ్ముంటే..:
మీడియాను తప్పు పడుతున్నావు. దమ్ముంటే, చేతనైతే నీ సినిమాను ఆపుకోమని. నేను ఛాలెంజ్‌ చేస్తున్నాను. పుణ్యం పాపం తెలియని మీడియాను ఎందుకురా తప్పు పడుతున్నావు. వారి పాపం ఏముంది. నీకు ఖలేజా ఉంటే కేసీఆర్‌ను, తెలంగాణ పోలీస్‌ను తిట్టు. 

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, జగన్‌మోహన్‌రెడ్డి గారు ఒకటే కోరుకున్నారు. సాయిధరమ్‌తేజ్‌ మంచి కుర్రాడు. త్వరగా కోలుకోవాలని. మా అందరికీ అదే అభిప్రాయం ఉంది. అదే కోరుకున్నాం. కోడి కత్తి కేసు ఏమైందని మీడియా అడగడం లేదు అని కూడా పీకే అన్నారు. అరే బాబూ ఆ కేసును కేంద్ర ఆధ్వర్యంలోని ఎన్‌ఐఏ చూస్తోంది. మనకేమైనా ఉంటే, ఒంట్లో ఏమైనా ఉంటే ఒక్కసారి అమిత్‌షా దగ్గరకు వెళ్లి ఒకసారి నిలదీయి. కోడి కత్తి కేసు ఏమైందని అడుగు. కానీ నీకు అక్కడ దమ్ములేదు. అక్కడ సినిమా లేదు. ఇక్కడికి వచ్చి మాత్రం సొల్లు కబుర్లకు మాత్రం ఫుల్‌ సినిమా ఉంది. ఏమనాలి అసలు నేను. మా వాడు పిరికి సన్నాసి అని చెప్పనా. 
 
కేంద్రాన్ని నిలదీయలేవు:
ఇంకా ఆయన మాట్లాడతాడు. కోట్లు పెట్టి సినిమా తీస్తే ప్రభుత్వ పెత్తనమా అని మాట్లాడాడు. కోట్లు పెట్టాను అని ఆ భాషలో చెప్పావు. జగన్‌గారిని, మమ్మల్ని సన్నాసులు అన్నావు కదా. మరి పన్నుల్లో కేంద్రానికి కూడా వాటా ఉంది కదా. మరి అలాంటప్పుడు మోదీ గారిని కూడా తిట్టాలి కదా. 

కాళ్లు కీళ్లు విరగొట్టుకుని, కిందా మీదా పడి, డ్యాన్సులు వేసి, ఒంగోని, పొర్లాడి మేము పది కోట్లు సంపాదిస్తే, మీకు పన్నులు ఎందుకు కట్టాలని, మీ నియంత్రణ ఏమిటని అడగాలి కదా. కానీ అడగవేం. అలాగే మా ప్రొడ్యూసర్లు ప్రైవేటు పెట్టుబడి కోట్లు పెట్టి సినిమాలు తీస్తే, ఈ జీఎస్టీ ఏమిట్రా. ఆ టాక్సులు ఏమిట్రా అని అడగాలి కదా. నిలదీయాలి కదా. కానీ ఎందుకు మాట్లాడలేదు. నోట్లో ఏం పెట్టుకున్నావు. భయమా. అడగలేవు. జీఎస్టీ ఏమిటని అడగలేవు.
 
సోది అందరికీ తెలుసు:
సోది అంతా మాకు తెలియదా. నాని మీద కపట ప్రేమ ఏమిటి. జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి. ఇదంతా ఏమిటి. మా లో ఓట్ల కోసం నీ తిప్పలు. ఇది అందరికీ తెలుసు. కాబట్టి అందరినీ నిలదీస్తే బాగుండేది. అందరినీ సన్నాసుల్లారా అని ఉంటే నేనూ అనుకునేవాణ్ని. మా కులంలో ఒక షేర్‌ ఉందని. చంద్రబాబుగారి దగ్గరికి వచ్చి కాళ్లు పట్టుకుంటావు. మోదీ గారి కాళ్లు పట్టుకుంటావు. జగన్‌మోహన్‌రెడ్డి గారిని జగన్‌రెడ్డి అంటావు.
 
ధైర్యంగా మాట్లాడుకుందాం:
ధైర్యంగా మాట్లాడుకుందాం. నేను కాపు కులంలో పుట్టాను. రాజశేఖర్‌రెడ్డిగారు అంటే ఎంతో గౌరవం. ఆయనను ప్రేమించాను. ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని కూడా ప్రేమిస్తాను. కాపులు ఎవరినైనా నమ్మితే నమ్మకంగా ఉంటాం. చిన్న రాజప్ప మన కాపే. చంద్రబాబుకు నమ్మకంగా ఉన్నాడు. నువ్వు కూడా చెప్పాలి కదా. నేను కూడా చంద్రబాబుకు నమ్మకంగా ఉన్నాను, భరోసా నిలబెట్టుకుంటాను అని చెప్పాలి కదా. మరి ఈ డ్రామాలు ఎందుకు.
 
ఎవడు సన్నాసి?:
సన్నాసి అంటే అర్థం ఒకటే. చేతకాని వాడు అని అర్ధం. నేను మొన్న 2019లో బందరులో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెల్చాను. మీ పీకేగాడు కూడా రెండు చోట్ల పోటీ చేశాడు. భీమవరం, గాజువాకలో. మరి ఎవడు సన్నాసి. నేను సన్నాసి అయితే, మావాడు సన్నాసిన్నర కదా. కాబట్టి మేము ఒకటే కులం కాబట్టి ఎన్నో అనుకుంటాం. మొన్న ఒక థియేటర్‌ యజమాని బ్రతిమిలాడుకున్నాడు. వాళ్ల బాధలు చెప్పుకున్నాడు. పీకే గాడు మాట్లాడుతుంటే, పాపం దిల్‌ రాజు రెడ్డి గారి పరిస్థితి దారుణంగా మారింది. 
 
వకీల్‌సాబ్‌ ఆపామా?:
ఆయన వకీల్‌సాబ్‌ సినిమా ఆపేశారని చెప్పారు. ఆ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో ఒకవేళ ఆపితే, దిల్‌రాజు రెడ్డిగారికి ఆ సినిమా షేర్‌గా రూ.55.60 కోట్లు వస్తే, తెలంగాణలో రూ.25.30 కోట్లు మాత్రమే వచ్చాయి. ఏరా దిక్కుమాలిన వెధవ. ఎందుకీ తప్పుడు మాటలు. ఒక్క రోజు అయినా దిల్‌రాజు రెడ్డిని పిల్చి లెక్కలు అడిగితే చెప్పేవారు కదా?

ఇది వకీల్‌సాబ్‌ సినిమాను జగన్‌మోహన్‌రెడ్డి గారు తొక్కేసినటు వంటి, ఆయన పీక పిసికేసినటువంటి, సినిమా హాళ్లు మూసేసినటువంటి చరిత్ర. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి ఆ ప్రొడ్యూసర్‌కు వచ్చిన షేర్‌ రూ.55.60 కోట్లు. ఒకవేళ నేను చెప్పిన లెక్కలు తప్పైతే నా మాటలను వెనక్కు తీసుకుంటాను. తప్పు చేశానని ఒప్పుకుంటా.
 
మీ డబ్బుతోనా?:
ఇంకా మా పవన్‌నాయుడు అంటాడు. తాము సినిమాలు తీస్తే ప్రభుత్వం ఎందుకు టికెట్లు అమ్ముతుందని. మటన్‌ వ్యాపారం, చికెన్‌ వ్యాపారం చేస్తుందని. ప్రభుత్వం దివాళా తీసిందని, అందుకే తమ డబ్బులు అడ్డం పెట్టుకుని లోన్లు తీసుకుంటోందని. మీ డబ్బా. ఈ బాబు 2021లో వకీల్‌సాబ్‌ అనే సినిమా తీసి రిలీజ్‌ చేశాడు. దాంతో ఆ సినిమా ద్వారా ప్రొడ్యూసర్‌కు ఇక్కడ రూ.55.60 కోట్లు వచ్చాయి. దాంతో ఈ ప్రభుత్వం నడస్తుంది 2021 ఏడాదంతా. ఏ బ్యాంక్‌ అయినా ఆ మొత్తానికే రుణం ఇస్తుందా. జగన్‌గారి ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం లబ్ధిదారుల ఖాతాల్లో ఏటా వేస్తున్న మొత్తం ఏకంగా రూ.60 వేల కోట్లు. 
 
మేమూ చిరంజీవిగారి అభిమానులం. ఆయనను అన్నయ్య అంటాం. సురేఖగారిని వదినమ్మ అంటాం. ఏరా పీకే ఆరోజు వదినమ్మ నిన్ను బాగా చదువుకోమంది. అయినా నీవు ఆ పని చేయలేదు. 2018లో అజ్ఞాతవాసి అనే సినిమాలో నటించావు. ఆరోజు మీ బాస్‌ ఉన్నారు. ప్రత్యేకషోలు వేశారు. అడ్డగోలు రేట్లు పెట్టారు. అయినా రూ.63 కోట్లు వచ్చాయి.
 
ఆన్‌లైన్‌ అందరూ కావాలన్నారు:
ఇక ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం. సుమారు 2003 నుంచి ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం కోసం నాడు ఉమ్మడి రాష్ట్రంలో సినీ పరిశ్రమ మొత్తం అప్పటి ముఖ్యమంత్రులను ఎన్నో సార్లు కలిసింది. అనేక అర్జీలు ఉన్నాయి. 2016లో తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌. దామోదర్‌ప్రసాద్‌ సంతకంతో ఒక అర్జీ. ఆ ఛాంబర్‌ గౌరవ కార్యదర్శిగా ఏపీ ఫిల్మ్‌ టీవీ థియేటర్‌ అభివృద్ధి సంస్థ ఎండీకి డిసెంబర్‌ 24, 2016న ఒక అర్జీ ఇచ్చారు. ఆ తర్వాత నవంబరు 1, 2018లో కూడా అదే ఛాంబర్‌ నుంచి మరో దరఖాస్తు ఇచ్చారు.
 
ఇక గత ఏడాది జూన్‌లో చిరంజీవితో పాటు, సినీ ప్రతినిధులు జగన్‌గారికి కలిశారు. అప్పుడు కూడా నారాయణ్‌దాస్‌ కిషన్‌దాస్‌ నారంగ్‌ సంతకంతో ఒక అర్జీని జగన్‌గారికి ఇచ్చారు. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం చేయమని సీఎం గారిని కోరడం జరిగింది.

ఈనెల 20న ఈ సన్నాసిని సినీ పరిశ్రమ పెద్దలు కలిశారు. వారు కూడా ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం అమలు చేయాలంటూ దరఖాస్తు ఇచ్చారు. మరి  మా వెధవన్నర వెధవ గాడు దీని గురించి ఏం చెబుతాడు. దిల్‌రాజు రెడ్డిగారు, కళ్యాణ్‌గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఆ మీటింగ్‌కు వచ్చారు. అందరూ ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం కావాలని కోరారు. వారంతా వయసులో చాలా పెద్దవారు. వారంతా సినీ పరిశ్రమ బాగుండాలని, ఇంకా థియేటర్లు కొనసాగాలని కోరుకునే వారు.
 
నీకేమిటి బాధ?
మరి ఆన్‌లైన్‌ టికెట్‌ విధానంపై నీకేమిటి బాధ. నీకు ఎందుకు అభ్యంతరం. అసలు నీ బాధ ఏమిటంటే.. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానంలో బ్లాక్‌ మార్కెట్‌ పోతుంది. పారదర్శకత ఏర్పడుతుంది. ప్రభుత్వానికి స్పష్టంగా లెక్కలు తెలుస్తాయి. అందుకే దీనిపై స్టడీ చేస్తే, అందరూ స్వాగతించారు. ప్రభుత్వం డబ్బులు దాస్తుందా. ఇదేనా నీ సంస్కారం. నీకు బుద్ధి ఉందా. ఇదేనా నీ విజ్ఞత. ఇదేనా నీ భాష. ఇదేనా నీ పదజాలం.
 
ఇదీ వాస్తవం:
అందరి కోరిక మేరకే ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం అమలు చేస్తామన్నాం. ప్రభుత్వం పోర్టల్‌ మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తుంది. టికెట్లు సినిమా హాల్‌ వాళ్లే అమ్ముకుంటారు. ఆన్‌లైన్‌లో అమ్ముతారు. ఇవాళ రాత్రి వరకు అమ్మిన డబ్బులు, మర్నాడు పొద్దున్నే రిజర్వ్‌ బ్యాంక్‌ గేట్‌వే ద్వారా ఎవరి డబ్బు వారికి వెళ్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఏ ఒక్క థియేటర్‌ యజమానితో అయినా మాట్లాడావా.
 
అంత చులకనా?:
ఎంత పల్చన. ఎంత వ్యంగ్యం నీకు. జగన్‌మోహన్‌రెడ్డి గారు ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నారని. అందుకే వారికి ప్రత్యేకంగా సినిమాహాళ్లు కట్టివ్వాలని ఎంత వ్యంగ్యంగా మాట్లాడావు. ఔను కాలం కలిసి వస్తే అలాగే కట్టిస్తారు. 
 
8 ఏళ్ల తర్వాత:
టికెట్ల రేటు గురించి మాట్లాడతాడు. 26.04.2013. అప్పుడు జీఓ నెం.100 ద్వారా టికెట్‌ రేటు పెంచారు. 8 ఏళ్ల తర్వాత జగన్‌గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌ 8న, 2013 రేట్ల కంటే 40 శాతం రేట్లు పెంచి జీఓ ఇచ్చింది.
 
ఎందుకీ కాకి గోల?:
మరి ఏమిటి నీ ఏడుపు. నీ కాకిగోల. అంటే టికెట్లు బ్లాక్‌లో అమ్మి, ఆ మొత్తం నీకు ప్రొడ్యూసర్లు కప్పం కట్టాలి. ప్రభుత్వం నిర్దేశించుకున్న రేటుకు టికెట్లు, నాలుగు షోలు వేయడం. దీని వల్ల నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి. సినిమాల్లో మాత్రమే నీతులు చెబుతాను. వెనకంతా బ్లాక్‌ దందా. ఇదేనా నీ మాట. అసలు నీవు ఏం పోటుగాడివి. నీ సినిమాల్లో ఏం హిట్‌ అయ్యాయి. భూమి బద్దలైనట్టు ఏం సినిమాలు నడిచాయి? నీ కంటే బుడ్డోళ్ల సినిమాలు బాగా ఆడాయి.
 
లెక్క మాత్రమే ఉంది:
పన్నులు పోను ఒక సినిమాకు ఆరున్నర కోట్లు వచ్చాయని నీవే చెబుతున్నావు. సంవత్సరానికి వంద కోట్ల ఆదాయం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పావు. అంటే ఏటా నీవు 10 సినిమాల్లో నటించావా. మా వాడికి నిజంగా తిక్క ఉంది. దానికో లెక్క ఉందని అనుకున్నాం. కానీ మా వాడికి తిక్క లేదు. కేవలం లెక్క మాత్రమే ఉందని తేలింది. అన్నీ నువ్వన్న మాటలే. ఎన్నో అనుకుంటాం. మనమంతా ఒకటే. ఒకే కులం.
 
కాపులు–రిజర్వేషన్లు:
టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడి, వైయస్సార్‌సీపీ వచ్చాక మీడియా ఆ విషయం మాట్లాడడం లేదన్నావు. 2014 ఎన్నికల్లో మోదీ ఏం చెప్పారు. బ్లాక్‌ మనీ తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.14 లక్షలు వేస్తానన్నాడు. ఇక్కడ ఒక పెద్దాయన చెప్పాడు. కాపులకు బీసీ రిజర్వేషన్లు. మత్స్యకారులను ఎస్సీల్లో చేరుస్తానన్నాడు. వారి మాటలకు భరోసా ఇస్తూ, నీవు వారికి ఓటేయమన్నావు. కానీ వారుమాట నిలబెట్టుకోలేదు. మరి ఏనాడైనా నీవు అడిగావా. ఆ తర్వాత కాపులకు రిజర్వేషన్లు ఏమిటని ప్రశ్నించావు. అసలు రిజర్వేషన్లే వద్దన్నావు.

అదే మా జగన్‌మోహన్‌రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని. వారి సంక్షేమం కోసం ఏటా రూ.10 వేల కోట్లు ఇస్తామని. మరి 5 ఏళ్లు మీ ప్రభుత్వం ఉంది కదా. కాపులు, బలిజల కోసం ఏం చేశావు. 
 
బోయల కల సాకారం:
బోయ కులస్తులకు ఎందుకు రాజకీయ ప్రాముఖ్యం రావడం లేదన్న దానిపై కధనాలు నడపమని మీడియాను కోరావు. ఏం రాజకీయంరా నీది. బోయలకు జగన్‌గారు అన్నింటా ప్రాధాన్యం ఇచ్చారు. ఆ కలను సాకారం చేస్తున్నారు. వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు.
 
అధికారంలో లేకపోతే!:
అధికారంలో ఉన్నవారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. అంటే అధికారంలో లేకపోతే బరితెగించి నీలా మాట్లాడాలా. నీవు ఏం చెప్పావు. 2012లో పార్టీ పెడతానని చంద్రబాబు దగ్గరకు పోతే, ఆయన పార్టీ పెట్టొద్దు అన్నాడని నీవే చెప్పావు. ఆ చంద్రబాబు కొడుకును గుంటూరు సభలో బండ బూతులు తిట్టావు. నేను చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టుని అని కూడా చెప్పావు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు అనుకూలంగా పార్టీ టికెట్లు ఇచ్చుకున్నావు. మంగళగిరిలో ఏం చేశావో అందరికీ తెలుసు. అలాంటి నీవు కులం, మతం గురించి  మాట్లాడుతున్నావు.
 
ధర్మం చెప్పండి:
ఇప్పటికే పీకే గాడి మాటలు సినీ పరిశ్రమ వారందరినీ కలవర పెడుతున్నాయి. సినీ పెద్దలను నేను ఒకటే కోరుతున్నాను. జగన్‌గారి ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా. మీరు ధర్మం చెప్పండి. మీరు వాస్తవాలు మాట్లాడాలి. ఇలాంటి కారుకూతలు మాట్లాడినప్పుడైనా మీరు నోరు విప్పాలి. సాయి ధరమ్‌తేజ్‌ త్వరగా కోలుకోవాలని మేమంతా కోరుకుంటున్నాం.
 
రిపబ్లిక్‌ సినిమా:
ఒరేయ్‌ పీకే. రిపబ్లిక్‌ సినిమాను ఇప్పటికే ఆంధ్రలో తీసుకున్నారు. ఎవరెవరు ఎంతకు తీసుకున్నారో తెలుసు. చెప్పమంటే చెబుతాను. ఒరేయ్‌ సన్నాసిన్నర సన్నాసి. దిల్‌రాజురెడ్డి గారు వైజాగ్‌ ఏరియాలో ఆ సినిమా తీసుకున్నారు. ఆ సినిమా గాలిలో ఏం లేదు.
 
ఫ్రెండ్లీ ప్రభుత్వం:
ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో జగన్‌గారి ప్రభుత్వం దేశంలోనే నెంబర్‌ వన్‌. అయితే ఎవరైనా అక్రమాలు చేస్తే వారికి మాత్రం సింహస్వప్నం.
 
తోలు తీస్తారు:
చివరగా, మనలో మనకు.. నేను నీ సినిమాలు చూశాను. అందరి సినిమాలు చూస్తాను. తెలుగు వాళ్లకు సినిమా పిచ్చి కాస్త ఎక్కువ. కానీ సినిమాలు మాకు ఏ మాత్రం వినోదం ఇవ్వలేదు. కానీ డబ్బులు ఇచ్చి చూశాం. కానీ మాకు ఆ డబ్బు ఎవడిస్తాడు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌. అజ్ఞాతవాసి. కెమెరామెన్‌ గంగతో రాంబాబు. ఇవన్నీ ఫ్లాప్‌లు. నిర్మాతలు నష్టపోయారు.
 
సినిమాల్లో యాక్షన్‌ మాత్రమే ఉంటుంది. కానీ ఇది లైవ్‌. కాబట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తోలు తీస్తారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ సినిమాలు నీవు తీసుకో. రోజూ అమిత్‌షాతో, నిర్మలా సీతారామన్‌గారితో కలిసి తిరుగుతున్నావు కదా. మా దగ్గర నేలమాణిగలో నిజంగా డబ్బు ఉంటే, దానిపై నీకు సమాచారం ఉంటే, కేంద్రానికి సమాచారం ఇప్వు. నీకు అంత పలుకుబడి ఉంది కదా. మరి పిలువు.