శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (08:23 IST)

దసరా తర్వాత కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ

దసరా తర్వాత కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో దిల్లీలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ‘‘ ప్రత్యక్ష విచారణతో న్యాయమూర్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. న్యాయవాదులకే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. లా కళాశాలల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించాలి.

మహిళలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లకు నా మద్దతు ఉంటుంది. మహిళలంతా ఐక్యంగా ఉండాలి. కోర్టుల్లో మహిళా న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలి. వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి’’ అని జస్టిస్‌ ఎన్వీరమణ అన్నారు.