గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:09 IST)

ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు...ఏ రోజున ఏ ఉత్సవం?

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7 వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించడం జరుగుతుందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పైలా సోమనాయుడు, కార్యనిర్వహణాధికారి డి. భ్రమరాంబ ప్రకటన లో తెలిపారు.

శ్రీ అమ్మవారి దివ్య అలంకారముల వివరాలు :
7-10-2021ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున శ్రీ స్వర్ణకవచాలంకరణ శ్రీ దుర్గాదేవి.
8-10-2021 విదియ శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవి.
9-10-2021 తదియ శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవి.
10-10-2021 చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి.
11-10-2021 పంచమి,షష్ఠి సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి.
12-10-2021శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం).
13-10-2021శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి).
14-10-2021శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి).
15-10-2021శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి).

11-10-2021తేదీ సోమవారం రోజున శుద్ధ పంచమి, షష్ఠి తిధులు వచ్చినందున శ్రీ అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.

15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందన్నారు.శ్రీ శివకామసుందరి దేవి అమ్మవారికి(ఉపాలయం)కూడా పేర్కొన్న విధంగా అలంకారములు ఉంటాయని తెలిపారు.ఆలయ దర్శనవేళలు, టిక్కెట్లు బుకింగ్, మార్పులు చేర్పులు కొరకు దేవస్థానం వెబ్సైట్ లో సందర్శించవచ్చునని అన్నారు.