శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Modified: ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (15:08 IST)

మంగళగిరి రూరల్ ఎస్సై పైన డాక్టర్ యామిని ఫిర్యాదు

మంగళగిరి మండలం నూతక్కి గ్రామంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. పెళ్లయిన కొద్దిరోజులకే భర్త బొమ్మారెడ్డి వెంకట రెడ్డితో విభేదాలు రావడంతో కోర్టును ఆశ్రయించింది భార్య యామిని ప్రియ.
 
గత కొన్ని రోజుల క్రితం భార్యతో కాపురం చేస్తానంటూ భర్త కోర్టుకు విజ్ఞప్తి చేయడంతో కాపురానికి వచ్చింది భార్య. ఐతే ఇంటి దగ్గర కోడలు గొడవ చేస్తుందంటూ అత్త,మామలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.
 
పోలీసులు రంగ ప్రవేశం చేసి అసభ్య పదజాలంతో ఎస్సై తనను దూషించడమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించడని మీడియా ముందు వాపోయింది బాధిత మహిళ, ఆమె తల్లి. బాధిత మహిళను ఆమె తల్లిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు రూరల్ పోలీసులు. 
 
ఇంట్లో నిర్బంధించి అత్తా,మామా తనపై దాడి చేస్తుంటే రక్షణ కోసం దిశ యాప్‌కు ఫోన్ చేసినా తనకు న్యాయం జరగలేదని బాధిత మహిళ వెల్లడించారు.