గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (14:00 IST)

నాగశౌర్య 'వరుడు కావలెను' రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వరుడు కావలెను’. తాజాగా మరో సినిమా విడుదల తేదీని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని అక్టోబ‌ర్ 15న విడుద‌ల చేస్తున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. 
 
కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య రూపిందించిన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. డీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
 
కరోనా మహమ్మారి నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న థీయేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు వరుసగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. 
 
ముఖ్యంగా వచ్చే నెలలో దసరా కానుకగా విడుదలై ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. ఇందులోభాగంగా, ఈ చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించారు.