శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (08:29 IST)

టీఆర్‌ఎస్‌ వారి ఇళ్లల్లో ఎందుకు సోదాలు చేయించడం లేదు?: కాంగ్రెస్‌

దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, ఇతర పార్టీల నాయకుల ఇళ్లలో ఐటీ దాడులు చేయిస్తున్న బీజేపీ.. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన వారి ఇళ్లల్లో ఎందుకు సోదాలు చేయించడం లేదని టీపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ రెండూ ఒక్కటేనని  అన్నారు. ఆ రెండు పార్టీలు ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ.. అన్న విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. 
 
మద్యం, గంజాయి, డ్రగ్స్‌, బెల్టు షాపుల వల్ల నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లాలో ఇటీవల హత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు.

మహిళ చిత్ర పటం వద్ద నివాళులర్పించి, బాధిత కుటుంబానికి రూ.లక్ష చెక్కును అందజేశారు. ఈ సందర్భంగానే మీడియాతో మాట్లాడారు. మహిళపై దారుణానికి పాల్పడిన వారికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. 

రాష్ట్రంలో కొవిడ్‌ మరణాలపై ఆడిట్‌ నిర్వహించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ సీఎం కేసీఆర్‌ను కోరారు. మరణాలకు నిర్దిష్ట కారణాలను చూపుతూ ధ్రువీకరణ పత్రాలనూ జారీ చేయాలన్నారు. కొవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం ఇచ్చే రూ.50 వేల సాయం పొందడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.