సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (12:38 IST)

అల్లు అర్జున్ పుష్ప సెకండ్ సింగిల్ లొకేష‌న్ ఇదే

Pupsha location
అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా సినిమా `పుష్ప ది రైజ్`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌హ‌జంగా సినిమాకు సంబంధించిన అప్ డేట్‌ల‌ను న‌టీన‌టుల ఫొటోల‌తో ప్ర‌చారం చేస్తుంటారు. కానీ సుకుమార్ త‌న భిన్న‌మైన శైలితో కేర‌ళ స‌మీపాన ఓ అంద‌మైన ప్రాంతాన్ని సోమ‌వారంనాడు రిలీజ్ చేశాడు. చుట్టూ చెట్లు ప‌క్క‌న చ‌క్క‌టి సెల‌యేరు ప్ర‌ప‌వ‌హించే ప్రాంతాన్ని పోస్ట్ చేస్తూ, ఇక్క‌డ పుష్ప సెకండ్ సింగిల్ సుందరమైన ప్రదేశంలో చిత్రీకరించామ‌ని ట్వీట్ చేశాడు. త్వ‌ర‌లో సెకండ్ సింగిల్ వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని తెలిపారు.
 
ఈ సినిమాతో ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ కు సుకుమార్ బిరుదు ఇచ్చాడు. రష్మికా మందన్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. భారీ అంచనాలు నెలకొల్పుకున్న‌ ఈ చిత్రం మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో అభిమానులు ఎప్పుడు నుంచి సెకండ్ సింగిల్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
అయితే నిజానికి ఈ పాట ఈ నెలలోనే రావాల్సి ఉంది కానీ సాంకేతిక కార‌ణాల‌వ‌ల్ల ఆల‌స్య‌మైంది. ఇప్పుడు దీనిపై మరింత ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఫస్ట్ చార్ట్ బస్టర్ మొత్తం 5 భాషల్లో రికార్డు చేసి ఒకేసారి మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి అలానే ఇప్పుడు రెండో సాంగ్ కూడా పలు భాషల్లో స్టార్ సింగర్స్ చేత దేవిశ్రీ ప్ర‌సాద్ పాడిస్తున్నాడు.