బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (13:10 IST)

పోసానిని మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి : నిహారిక డిమాండ్

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై అసభ్యపదజాలంతో మాట్లాడిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై మెగా డాటర్ నిహారిక తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 'రిపబ్లిక్' సినిమా ఫంక్షన్‌లో ఆడవాళ్లపై పవన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని నిహారిక వ్యాఖ్యానించింది. 
 
ఏపీ సీఎం జగన్‌పై ఆరోపణలు చేసినందుకే పోసాని ఓవర్‌గా రియాక్ట్ అవుతున్నాడని  మండిపడింది. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న పోసానిని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని నిహారిక డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి పోసానిపై చర్యలు తీసుకోవాలని నిహారిక కోరింది. 
 
కాగా మంగళవారం నాడు ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో పవన్‌పై పోసాని తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు అసభ్యపదజాలంతో దూషణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని టీడీపీ నేతలు తిడితే పవన్ కల్యాణ్ ఎటు పోయారని ప్రశ్నించారు. 
 
చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వారు తిడితే.. తానే కౌంటర్ ఇచ్చానని గుర్తుచేశారు. అంతేగాకుండా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా పోసాని మాట్లాడారు. పవన్, ఆయన అభిమానులు సైకోలని అన్నారు. దీంతో ఆయన ప్రెస్ మీట్ వద్దకు పవన్ అభిమానులు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. హైదరాబాద్‌లో పవన్ అభిమానుల ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదైంది.