1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Vedic school teacher in Washim held for raping minor

మైనర్ బాలికపై వేద పాఠశాల ఉపాధ్యాయుడు అత్యాచారం

Vedic School Teacher
మహారాష్ట్రలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ వేద పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని వాషీమ్‌లో జరిగింది. వేద పాఠాలు బోధించే ఉపాధ్యాయుడే ఈ పాడుపనికి పాల్పడటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగరంలోని శ్రీ నరసింగ్ సరస్వతి స్వామి మహారాజ్ వేదపాఠశాలలో 12 యేళ్ళ బాలిక చదువుతోంది. ఈ బాలికను తన ఇంటికి పిలిచిన ఉపాధ్యాయుడు.. కాళ్లు నొప్పులుగా ఉన్నాయని.. కాస్త నొక్కాలని చెప్పాడు. దీంతో ఆ బాలిక కాళ్లు నొక్కడం ప్రారంభించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ బాలికపై ఉపాధ్యాయుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
దీంతో బోరున విలపిస్తూ ఇంటికి వచ్చిన ఆ బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... కామాంధ ఉపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
#HistoryInToday : ప్రకృతి జల ప్రళయం సునామీకి 17 యేళ్లు