సంబంధిత వార్తలు
- బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్: దీప్తి సునయన వచ్చేస్తోందట..
- సీనీ దిగ్గజం కైకాల సత్యన్నారాయణ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
- బాబు ట్రాప్‌లో నందమూరి కుటుంబం.. నోటికొచ్చినట్టు మాట్లాడితే మహిళలు రాజకీయాల్లోకి వస్తారా?
- అబ్బే, భువనేశ్వరిని మేమేమీ అనలేదు, ఎన్టీఆర్ బిడ్డలకే విషం ఎక్కించిన వ్యక్తి బాబు: మంత్రి పేర్ని నాని
- బస్సులో చనిపోయిన కండక్టర్ కుటుంబానికి రూ.50లక్షలు పరిహారం
ఆర్టీసీ బస్సులో స్టెప్పులు వేస్తూ ఫ్యామిలీతో కలిసి జర్నీ చేసిన సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ విధుల్లో చేరిన మరుక్షణం నుంచి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తన మార్క్‌తో సమస్యలు ఎలాంటివైనా వాటిని పరిష్కరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదేసమయంలో ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.
ముఖ్యంగా, ఆర్టీసీకి సంబంధించి ఎవరైనా ఏదైనా స్పందిస్తే తక్షణం వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. అలాగే, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ ప్రయాణికుల సమస్యలను తెలుకుంటున్నారు. ఇప్పటికే అనేక మార్లు ఆయన బస్సుల్లో ప్రయాణించారు.
తాజాగా మరోమారు ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అయితే, ఈ దఫా మాత్రం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించడం గమనార్హం. సజ్జనార్ కుటుంబంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
పైగా, ఈ బస్సులో ఆయన స్టెప్పులు కూడా వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి జర్నీ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఆడుతూపాడుతూ కనిపించారు. ఆర్టీసీ బస్సులో సపరివార సమేతంగా బస్సులో ప్రయాణించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
V.C Sajjanar IPS, MD #TSRTC కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు మరియు సపరివార సమేతంగా బస్సులో ప్రయాణం చేసి TSRTC బస్సులో ప్రయాణం సురక్షితం,సుఖమయం మరియు శుభప్రదం అని ప్రయాణికులకు
— SAITEZAA (@ActivistTeja) November 29, 2021
భరోసా కల్పిస్తున్న వైనం.
It's Family Time Huhuhu, hooohu@TSRTCHQ @tsrtcmdoffice @HiHyderabad @sushilrTOI pic.twitter.com/3jyDKYPoVb
తర్వాతి కథనం