శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 20 నవంబరు 2021 (14:26 IST)

అబ్బే, భువనేశ్వరిని మేమేమీ అనలేదు, ఎన్టీఆర్ బిడ్డలకే విషం ఎక్కించిన వ్యక్తి బాబు: మంత్రి పేర్ని నాని

నారా భువనేశ్వరి పైన తామేదో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మంత్రి నాని. మా పార్టీ నాయకులు నారా భువనేశ్వరి గారిని ఏమీ అనలేదన్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకమనీ, రాజకీయంగా తమ పార్టీని ఎదుర్కోలేక వేరేవిధంగా జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు.

 
అసెంబ్లీలో జరగని విషయాలను కూడా జరిగినట్లు చూపిస్తున్నారనీ, సభా సాంప్రదాయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో జరిగిన ఘటనలను సోషల్ మీడియాకు షేర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదంతా చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న నాటకం తప్పించి మరొకటి కాదని విమర్శించారు.

 
తమ నాయకులపై ఎన్టీఆర్ కుటుంబం విమర్శలు చేసేముందు నిజాలు ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. సాక్షాత్తూ ఎన్టీఆర్ పైనే వ్యతిరేక విమర్శలు చేయడం కాక, ఎన్టీఆర్ దుర్మార్గుడని ఆయన కుటుంబ సభ్యులకే విషం ఎక్కించిన ఘనత చంద్రబాబు నాయుడు సొంతం అని విమర్శించారు.