బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 24 నవంబరు 2021 (15:25 IST)

సీనీ దిగ్గ‌జం కైకాల స‌త్య‌న్నారాయ‌ణ ఆరోగ్యంపై సీఎం జగన్‌ ఆరా

అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. కైకాల‌ కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయ‌న ఆరోగ్యంపై వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా ఆయ‌న ఆందోళ‌న చెంది, కుటుంబ స‌భ్యుల‌ను విచారించిన‌ట్లు తెలుస్తోంది. 
 
 
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా కైకాల ఆరోగ్యంపై ఏపీ సీఎం జగన్ ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కైకాల కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
 
 
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. కైకాల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తున్నారు. బీపీ లెవల్స్ పడిపోవడంతో వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కైకాల ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసి, ఆయ‌న కోలుకోవాల‌ని కోరారు.