శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:09 IST)

రిటైర్మెంట్ సొమ్మును పేద విద్యార్థుల చదువుకు దానం చేసిన ఉపాధ్యాయుడు

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు 39 యేళ్లపాటు ఉద్యోగం చేసి పదవీ విరమణ ద్వారా వచ్చిన డబ్బునంతా పేద విద్యార్థుల చదువుకే ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ఈ ఆశ్చర్యకర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ రాష్ట్రంలోని పన్నా జిల్లా, ఖాందియాకు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి 39 యేళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 
 
ఇటీవలే ఆయన పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన చేసిన సర్వీసుకు రూ.40 లక్షల మేరకు సొమ్ము వచ్చింది. ఈ సొమ్మును ఆయన పేద విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. అదీ కూడా తన భార్యాపిల్లల నిర్ణయం మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు.
 
 
 
తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని బాధలన్నింటినీ మనం తగ్గించలేమన్నారు. కానీ, మనం చేయాల్సిన కాసింత మంచినైనా చేద్దామన్నారు. తాను రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నానని, చదువంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఆ కష్టం రాకూడదనే తన సర్వీసు కాలంలో సంపాదించిన, పొదుపు చేసిన సమ్మును పేద విద్యార్థుల విద్యకే ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.