శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 జనవరి 2022 (17:09 IST)

మధ్యప్రదేశ్‌లో విద్యా సంస్థలు బంద్ ... సీఎం శివరాజ్ సింగ్ వెల్లడి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరింది. గడిచిన 24 గంటల్లో దాదాపు 2.64 లక్షల మేరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఒమిక్రాన్ కేసులు కూడా ఐదు వేలకు పైగా దాటిపోయాయి. అదేసమయంలో పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. ఈ వైరస్ వ్యాప్తికి అనేక ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఇందులోభాగంగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఈ నెల 31వ తేదీ వరకు ఒకటో తేదీ నుంచి 12వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, రాజకీయ, మతపరమైన, ఇతర వేడుకలను కూడా నిషేధిస్తున్నట్టు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ వెల్లడించారు. 
 
కాగా, గురువారం ఒక్క రోజే ఈ రాష్ట్రంలో 4031 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే కోవిడ్ పాజిటివిటీ రేటు 4.5 శాతం 5.1 శాతానికి పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది.