జనవరి 31 వరకు బెంగళూరులో స్కూల్స్ మూసివేత
కోవిడ్-19 కేసుల వ్యాప్తిని దృష్టిలో బెంగళూరులోని 1 నుంచి 9 తరగతుల పాఠశాలలను జనవరి 31 వరకు మూసివేయనున్నట్లు కర్ణాటక సర్కారు ప్రకటించింది. అయితే 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులు కొనసాగుతాయని, టెక్నికల్ కమిటీ సిఫారసుల తర్వాత దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
పరీక్షలు వాయిదా 10 నుండి 12 తరగతుల పాఠశాలలు, నర్సింగ్, మెడికల్, పారామెడికల్ కళాశాలలు మినహా బెంగళూరులోని అన్ని పాఠశాలలు, కళాశాలలను జనవరి మధ్య వరకు మూసివేయాలని రాష్ట్రం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు జనవరి నెలాఖరు వరకు పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటకలో కరోనా కొత్త కేసులు 20వేలకు పైగానే నమోదు అవుతున్నాయి.
రాష్ట్రంలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 93,099 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 10.96శాతంగా ఉంది. బెంగళూరులో 10 వేల కరోనా కేసులు ఉన్నాయి. అందుకే కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రోటోకాల్‌లు , జాగ్రత్తలను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.