శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 జనవరి 2022 (15:55 IST)

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 26 వరకు మూసివేత

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ వరకు విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో పలు రాష్ట్రాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, స్కూల్స్, కాలేజీలను మూసివేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీ వరకు అన్ని రకాల విద్యా సంస్థలను మూసి వేయాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
 
ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి, వైద్య, పోలీసు అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం తెలిపారు.  అదేసమయంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను మెరుగుపరచాలని, కోవిడ్ క్లస్టర్లను సమర్థవంతంగా పర్యవేక్షించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
 
అలాగే, కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అస్సాం రాష్ట్రంలో కూడా ఐదో తరగతి వరకు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా కర్ఫ్యూ సమయం కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.